Trending news

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్.. నేడు తులం ఎంతుందంటే?

[ad_1]

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • భారీగా పెరిగిన వెండి
  • నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్.. నేడు తులం ఎంతుందంటే?

Gold and Silver Price in Hyderabad: గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.10 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,030లుగా నమోదైంది. కేంద్ర బడ్జెట్ 2024లో సుంకాన్ని తగ్గించడంతో భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ పరుగులు పెడుతోంది.

నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,940లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,030గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.67,090 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.73,180గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940గా.. 24 క్యారెట్ల ధర రూ.73,030గా కొనసాగుతోంది.

Also Read: Director Ranjith: లైంగిక వేధింపుల ఆరోపణలు.. డైరెక్టర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు!

మరోవైపు నిన్న స్వల్పంగా పెరిగిన వెండి ధర.. నేడు భారీగా పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.88,500గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండిపై రూ.600 పెరిగింది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.88,500లుగా ఉండగా.. చెన్నైలో రూ.93,500లుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,000గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.93,500 వద్ద కొనసాగుతోంది.



[ad_2]

Source link

Related Articles

Back to top button
Close
Close