Trending news

Ghatkesar Crime: పుట్టిన రోజు వేడుకలో విషాదం.. సాప్ట్‌ వేర్ ఉద్యోగి మృతి..!

[ad_1]

  • ఘట్ కేసర్ పరిధిలో విల్లా లో పుట్టిన రోజు వేడుకలో విషాదం..

  • ఈత రాదని చెబుతున్నప్పటికీ స్విమ్మింగ్ పూల్ లో వేసి వెళ్లిపోయిన ఫ్రెండ్స్..

  • 45 నిమిషాల పాటు ఈతకులంలో కొట్టుమిట్టాడి చనిపోయిన అజయ్..
Ghatkesar Crime: పుట్టిన రోజు వేడుకలో విషాదం.. సాప్ట్‌ వేర్ ఉద్యోగి మృతి..!

Ghatkesar Crime: పుట్టిన రోజు వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత కొలనులో సాప్ట్ వేర్ ఎంప్లాయ్ మృతి చెందిన ఘటన ఘట్ కేసర్ లో కలకలం రేపుతుంది.

మాదాపూర్ లో ఓ ఐటీ సంస్థలో మేనేజర్ గా పని చేసే శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఘట్ కేసర్ పరిధిలో విల్లాలో విందు, వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు 20 మంది ఉద్యోగులు హాజరయ్యారు. అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. మద్యం సేవించి ఆట, పాటలు పాడుతూ సంతోషంగా గడిపారు. అయితే ఇంతలోనే ఓ విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుకల్లో తోటి ఉద్యోగులే అజయ్ అనే వ్యక్తిని హత్య చేశారు. వీరందరూ పార్టీ నిర్వహిస్తున్న విల్లాలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడ అందరూ మద్యం సేవిస్తూ.. అజయ్ తో మాట మాట కలుపుతూ స్విమ్మింగ్ పూల్ లో తోసేశారు.

Read also: Telangana project: ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలు.. ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..

అయితే అజయ్ అక్కడున్న వారితో తనకు స్విమ్మంగ్ రాదని చెబుతున్నా వినలేదు. మద్యం మత్తులో వున్న అందరూ అజయ్ ను స్విమ్మింగ్ పూల్ లో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అజయ్ 45 నిమిషాల పాటు ఈత కులనులో కొట్టుమిట్టాడి బయటకు రాలేక చివరకు ప్రాణాలు వదిలాడు. అయితే ఇంత జరుగుతున్న మేనేజర్ శ్రీకాంత్ కూడా అక్కడే వున్నాడు. అందరూ అజయ్ కు ఈత రాదని చెబుతున్న పట్టించుకోకుండా అక్కడి నుంచి మేనేజర్ తో సహా తోటి ఉద్యోగులు వెళ్లిపోయారు. స్విమ్మింగ్ పూల్ కూడా లోతుగా ఉండటం, అజయ్ కు ఈత రాకపోవడంతో అందులోనే ప్రాణాలు వదిలాడు. తరువాతి రోజు అజయ్ చెనిపోయాడన్న వార్త విన్న మేనేజర్, తోటి ఉద్యోగులు షాక్ తిన్నారు. ఈ ఘలనపై పోలీసులకు సమాచారం అందడంతో కేసునమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
Medak Temple: మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం



[ad_2]

Related Articles

Back to top button
Close
Close