Trending news

Gautam Gambhir: గంభీర్ ఆల్టైమ్ భారత వన్డే జట్టు.. రోహిత్ శర్మకు దక్కని చోటు..

[ad_1]

  • ఆల్ టైమ్ భారత వన్డే జట్టును ప్రకటించిన గౌతమ్ గంభీర్..

  • మరోసారి ఎంఎస్ ధోనికే సారథ్య బాధ్యలను అప్పగించిన గంభీర్..

  • గంభీర్ ఆల్ టైమ్ టీమిండియా వన్డే జట్టులో రోహిత్ శర్మకు నో ఛాన్స్..
Gautam Gambhir: గంభీర్ ఆల్టైమ్ భారత వన్డే జట్టు.. రోహిత్ శర్మకు దక్కని చోటు..

Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఆల్ టైమ్ భారత వన్డే జట్టును ప్రకటించారు. దీనికి సారథిగా మహేంద్ర సింగ్ ధోనినీ ఎంచుకున్నారు. అయితే, ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదు. ఇక, గంభీర్ ఎంపిక చేసిన జట్టు.. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ ( కెప్టెన్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ లకు అవకాశం ఇచ్చారు.

Read Also: Yuvraj Singh Father: నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు.. ధోనీపై తీవ్ర ఆరోపణలు

అయితే, భారతదేశ ప్రముఖ కామెంటేటర్ హ‌ర్షా భోగ్లే కూడా త‌న ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ జట్టను ప్రకటించారు. తన జ‌ట్టుకు కెప్టెన్‌గా టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడైన రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ ఐదు టైటిల్స్ అందించడంతో పాటు భారత జట్టుకు వన్డే వరల్డ్ కప్ అందించాడు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close