Trending news

Gaucher Disease: తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు రూ.24 లక్షలు.

[ad_1]

ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తింటే అరగక, తినక పోతే ప్రాణాపాయ స్థితికి చేరుతున్న పరిస్థితితో నరకయాతన అనుభవిస్తున్నాడు. తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. ఉన్నంతలో గుట్టుగా బతుకుతున్న కుటుంబం. కన్నబిడ్డకు సోకిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగురించి తెలిసి హతాశులయ్యారు. వైద్యం చేయించే స్తోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్‌ సెలూన్‌ నిర్వహిస్తున్నారు. భార్య అలేఖ్య గృహిణి. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు మాధవన్‌ ఉన్నాడు. బాబు పుట్టాక ఏడాదిన్నర వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత తరచూ పొట్ట, కాళ్లు ఉబ్బడం ప్రారంభమైంది. అన్నం జీర్ణం కాకపోవడం, కాలేయానికి వాపు వస్తుండటంతో నరకయాతన అనుభవిస్తున్నాడు. హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి బాలుడికి జన్యు సంబంధిత ‘గౌచర్‌’ సోకిందని, తమ వద్ద చికిత్స లేదన్నారు. ప్రైవేటు అస్పత్రిని సంప్రదించగా అక్కడి వైద్యులు… 15 రోజులకోసారి రూ.1.24 లక్షల విలువైన ఇంజెక్షన్‌ ఇస్తే తాత్కాలికంగా ప్రాణం నిలుస్తుందన్నారు.

అదే ఆస్పత్రికి చెందిన ఛారిటీ ట్రస్టు రాయితీ ఇస్తుండగా తల్లిదండ్రులు ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.70 వేలు చెల్లిస్తున్నారు. వ్యాధి పూర్తిగా తగ్గడానికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని, రూ.24 లక్షల వరకు అవుతుందని వైద్యులు సూచించారు. ఇప్పటికే తాము అప్పుల్లో మునిగిపోయామని, అమ్మడానికి తమకు ఆస్తులుకూడా లేవని… ప్రభుత్వం, మనసున్న మారాజులు స్పందించి తమ కుమారుడికి శస్త్రచికిత్స చేయించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమ పూర్తి వివరాలకు 8008952399 నంబరును సంప్రదించాలని విన్నవిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close