Gannavaram Airport: వర్షాలు, వరదల ఎఫెక్ట్.. గవన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీ..

[ad_1]
- గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ..
-
వర్షాలు.. వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్..

Gannavaram Airport: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడానికి తోడు.. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం అవుతుంది.. ఇక, విజయవాడ సిటీలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.. విజయవాడ-హైదరాబాద్ హైవేపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.. మరోవైపు.. రైల్వే లైన్లు కొట్టుకుపోవడంతో.. వందలాది రైళ్లను రద్దు చేసిన పరిస్థితి నెలకొంది.. దీంతో.. ప్రత్యామ్నాయ మార్గాలను బెజవాడ వాసులు ఆధారాపడాల్సిన పరిస్థితి వచ్చింది.. దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.. వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్ వచ్చింది.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో… గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.. అయితే, పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్‌లు దర్శనమిస్తున్నాయి.. అయితే, పెరిగిన ప్రయాణికుల రద్దీకి తగిన విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. కాగా, భారీ వర్షాలు.. వరదలతో విజయవాడ సిటీలోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఆయా ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు సహా.. మంత్రులు.. అధికారులు పర్యవేక్షిస్తున్న సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు..
Read Also: Supreme Court: బుల్డోజర్ చర్యలపై మండిపడ్డ సుప్రీంకోర్టు
[ad_2]