French Fries: ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్.. ఎలాగంటే!

[ad_1]
ఫ్రెండ్ ఫ్రైస్ అంటే పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని మనకు ఇష్టం ఉన్న రుచితో తయారు చేసుకోవచ్చు. స్పైసీ ఇష్ట పడేవారు స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ తినవచ్చు. చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్ బయట రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. అక్కడ రేటు ఎక్కువ.. ఇచ్చే క్వాంటిటీ చాలా తక్కువ. మెక్‌డొనాల్డ్స్ తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనం ఆ స్టైల్‌లో కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో హెల్దీగా, రుచిగా చేసుకోవచ్చు. మరి మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్‌కి కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు, వైట్ వెనిగర్, ఉప్పు, ఐస్ ముక్కలు, ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్.
ఇవి కూడా చదవండి
మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం:
ముందుగా వీటిని తయారు చేయడానికి ఆలు గడ్డలకు తొక్క తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు రెండు, మూడు సార్లు శుభ్రంగా కడిగి.. ఉప్పు, వెనిగర్ వేసిన చల్లటి నీటిలో వేసి ఓ అరగంట సేపు అలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. రుచి కూడా పెరుగుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక వీటిని వేసి మీడియం మంటపై అన్ని వైపులా వేయించుకోండి.
బంగాళ దుంప ముక్కలు కొద్దిగా ఉండే ఒకటే సారి ఆయిల్‌లో వేసి వేయించుకోవచ్చు. లేదంటే బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వేసి వేయిస్తూ ఉండండి. ఇలా చేస్తే క్రిస్పీగా ఉంటాయి. చక్కగా ఉడుకుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఆయిల్ నుంచి బయటకు తీయగానే చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలపండి. చిల్లీ ఫ్లేక్స్ అవసరం లేదు అనుకుంటే సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. ఇంకా ఇందులో చాట్ మసాలా వేస్తే మరింత రుచిగా ఉంటాయి. అంతే ఎంతో రుచిగా ఉండే మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ సిద్ధం.
[ad_2]