Trending news

Former BRS MLA Patnam Narender Reddy Shifted To Parigi Police Station

[ad_1]

  • వికారాబాద్ డీటీసీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి తరలింపు..
  • పరిగి పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని తీసుకెళ్లిన పోలీసులు..
Patnam Narender Reddy: వికారాబాద్ డీటీసీ నుంచి పరిగికి పట్నం నరేందర్ రెడ్డి తరలింపు..

Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతవరణం కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ లోని అడిషనల్ ఎస్పీ కార్యాలయం డీటీసీ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.. లగచర్లలో అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కలెక్టర్ పై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్ర ఉందని భావించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: iQOO 13 Launch: భారత మార్కెట్లోకి ‘ఐకూ 13’.. లాంచ్, ధర డీటెయిల్స్ ఇవే?

అయితే, లగచర్లలో దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేసి.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో రెండు గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఐజీ సత్యనారాయణ సైతం మరో గంటన్నర పాటు నరేందర్ రెడ్డిని విచారించారు. అనంతరం మాజీ బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేను పరిగి పీఎస్ కు తరలించారు. అక్కడి నుంచి కోడంగల్ కోర్టులో ఆయనను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కోడంగల్ లోని న్యాయస్థానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close