Food Supply Through to Drones: డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా.. సిద్ధమవుతున్న సర్కార్..

[ad_1]
- డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు సన్నద్ధం అవుతున్న సర్కార్..
-
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు.. -
డ్రోన్ల ద్వారా ఫుడ్.. బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని పరిశీలించిన సీఎం.. -
వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లను సిద్ధంచేయాలని సీఎం ఆదేశాలు..

Food Supply Through to Drones: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను భారీ వర్షాలు.. వరదలు ఇబ్బంది పెడుతున్నాయి.. ఇక, విజయవాడ వాసుల కష్టాలు వర్ణనతీతంగా మారాయి.. అపార్ట్‌మెంట్ల చుట్టూ నీరు చుట్టేయడంతో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.. రోప్ వే ద్వారా ఫుడ్ అందిస్తూ వారి ఆకలి తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.. వాటర్ క్యాన్లు, పాల ప్యాకెట్లు రోప్ వే మార్గంలోనే పంపిస్తు్నారు.. ఇక, బుడమేరు సృష్టించిన బీభత్సంతో విజయవాడ వాసుల కష్టాలు అంతాఇంతా కాకుండా పోయాయి.. మరోవైపు.. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది ప్రభుత్వం..
Read Also: CM Revanth Reddy: వరద ముంపు ప్రాంతాలలో పర్యటించాలి.. ప్రధానికి సీఎం రేవంత్ లేఖ
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చంద్రబాబు సర్కార్.. డ్రోన్ల ద్వారా ఫుడ్, బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని సీఎంకు వివరించారు ఐ అండ్ ఐ సెక్రటరీ సురేష్ కుమార్. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేయొచ్చని ముఖ్యమంత్రికి వివరించారు సురేష్ కుమార్. దీంతో.. ఎన్ని వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లను సిద్ధంచేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
[ad_2]