Trending news

FASTag: ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? కొత్త టెక్నాలజీతో టోల్ గేట్ల పరిస్థితి ఏంటి?

[ad_1]

ఫాస్ట్​ట్యాగ్​ రాకతో హైవేలపై టోల్ ​ప్లాజాల వద్ద వాహనాల క్యూలైన్లు తగ్గిన మాట వాస్తవమే కానీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ప్రయాణించిన దూరం కంటే ఫీజు అధికంగా ఉంటోందని చెప్తున్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతోన్న నూతన టెక్నాలజీతో ప్రయాణ దూరానికి మాత్రమే టోల్​ చెల్లించే అవకాశం ఉంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. వాహనాలు టోల్ బూత్‌ల మీదుగా వెళుతున్నప్పుడు ఆటోమేటిక్​గా టోల్ చార్జి డిజిటల్​ వాలెట్​ నుంచి కట్​ అవుతుంది. అయితే కొన్ని లోపాలు వాహనదారులను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. దాంతో సరికొత్త ఆవిష్కరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ కొత్త టెక్నాలజీని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గా పిలుస్తున్నారు.

GNSS వినియోగం వల్ల టోల్ ఛార్జీలు ప్రయాణించిన వాస్తవ దూరం ఆధారంగా ఉంటాయి కాబట్టి ఇకపై తక్కువ దూరానికి ఎక్కువ చార్జీ చెల్లించాల్సిన పని లేదు. శాటిలై్ట్‌ ఆధారిత వ్యవస్థ.. టోల్ ఎగవేత అవకాశాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. FASTag నుంచి GNSS విధానానికి మారిపోవడం ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. FASTag సాంకేతికతతో GNSSని అనుసంధానించే హైబ్రిడ్ మోడల్‌తో ప్రారంభం అవుతుంది. కేంద్రం ఇప్పటికే రెండు ప్రధాన జాతీయ రహదారులపై GNSS పరీక్షను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వీటిలో కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ జాతీయ రహదారి (NH-275), హర్యానాలోని పానిపట్-హిసార్ జాతీయ రహదారి (NH-709) ఉన్నాయి.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close