‘Emergency’: ‘ఎమర్జెన్సీ’ మూవీపై రాజుకుంటున్న వివాదం.. రిలీజ్ చేస్తే చంపేస్తామంటూ కంగనాకు వార్నింగ్!

[ad_1]
నటి కంగనా రనౌత్ ఉన్నచోటుకు వివాదాలు వస్తాయో లేక వివాదాలను వెతుకుంటూ కంగనా వెళ్తారో కానీ.. కంగనా, కాంట్రవర్శీలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. తాజాగా ఆమె స్వీయదర్శకత్వంలో నటించిన ఎమర్జెన్సీ మూవీ..వివాదాలకు కేరాఫ్‌గా మారింది.
నిత్యం వివాదాలతో సహవాసం చేసే కంగనా.. ఎమర్జెన్సీ మూవీతో మారోసారి కంట్రావర్సీకి కేరాఫ్‌గా మారారు. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని ఓ వర్గం హెచ్చరిస్తుంటే.. కంగనా మాత్రం తగ్గేదే లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో “ఎమర్జెన్సీ” మూవీని బ్యాన్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా “ఎమర్జెన్సీ” మూవీని తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ కథానాయిక. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ చిత్రంలో తమని తప్పుగా చూపించారని సిక్కులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సినిమాను రిలీజ్ చేస్తే చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు కూడా వస్తున్నాయి.
కంగనా తెరకెక్కించిన ఎమర్జెన్సీ చిత్రాన్ని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందిరాగాంధీ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కోలేక కంగనా రూపంలో బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు హస్తం పార్టీ నేతలు.
అయితే ఎన్ని ఆరోపణలు ఎదురైనా.. బెదిరింపులు వచ్చినా భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగనా. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేసి తీరుతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి బాలీవుడ్ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంగనా. బాలీవుడ్‌లో టాలెంట్ ఉన్నవారికి ఎలాంటి గుర్తింపు లభించదని, ఇదొక నిస్సాహాయ ప్రదేశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ఆరంభంలో ఆఫర్స్ లేక తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానని, ఓ దశలో విదేశాలకు కూడా వెళ్లిపోవాలనుకున్నానంటూ కామెంట్స్ చేశారు. అలాగే తన సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు కంగనా. తన సినిమా కోసం ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధమేనని..అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు.
యాక్టర్ నుండి పొలిటిషియన్‌గా మారిన కంగనాకు వివాదాలు కొత్త కాదు. బంగ్లాదేశ్ ఆందోళకారులతో రైతులను కంగనా పోల్చడంపై ఇటీవల దుమారం చెలరేగింది. గతంలో కూడా సాగు చట్టాలను వ్యతిరేకించిన వాళ్లను, ఉగ్రవాదులతో పోల్చారు కంగనా. రైతుల నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ఆరోపించారు. కేంద్ర తీసుకున్న చర్యల వల్లే పరిస్థితి అదుపులో ఉందని, లేకుంటే దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారి తీసేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కంగనా.
కంగనా వ్యాఖ్యలతో భగ్గుమన్నారు కాంగ్రెస్ నేతలు. రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనాను, బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్.. కంగనా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. రైతులపై కంగనా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, భవిష్యత్‌లో ఇలాంటి కామెంట్స్ చేయవద్దని హెచ్చరించింది. ఆ వివాదం సద్దుమణిగిందో లేదో, ఎమర్జెన్సీ మూవీతో మరోసారి కాంట్రవర్సీలో చిక్కుకున్నారు నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[ad_2]