Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు ఔట్.. లిస్టులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు

[ad_1]
Duleep Trophy 2024: సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ టోర్నీ తొలి రౌండ్ నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్లు తప్పుకున్నారు. వీరిలో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమవగా, రవీంద్ర జడేజా వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు. దీని ప్రకారం ఇప్పుడు టీమ్ బి, టీమ్ సికి ప్రత్యామ్నాయంగా ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేశారు.
ఇక్కడ మహ్మద్ సిరాజ్ స్థానంలో టీమిండియా పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేయగా, ఉమ్రాన్ మాలిక్ స్థానంలో గౌరవ్ యాదవ్ ఎంపికయ్యాడు. అయితే, రవీంద్ర జడేజా స్థానంలో ఎవరిని ఎంపిక చేయలేదు.
పోటీలో 4 జట్లు..
ఈసారి దులీప్ ట్రోఫీలో మొత్తం నాలుగు జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహిస్తారు. ఈ జట్లలో స్థానం పొందిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..
జట్టు ఎ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొట్యాన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, పర్షిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కవీరప్ప, కుమార్ కుషాగ్రా, శాశ్వత్ రావత్.
టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , ఎన్ జగదేశన్ (వికెట్ కీపర్)
టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, గవూర్ వారియర్, యాదవ్
టీమ్ డి: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ టైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ దేశ్‌పాండే, భరత్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[ad_2]