Draupadi Murmu: వైద్యురాలి అత్యాచార ఘటనపై తొలిసారిగా స్పందించిన రాష్ట్రపతి

[ad_1]
- కోల్ కతా ఘటనపై స్పందించిన రాష్ట్రపతి
- పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ద్రౌపది ముర్ము
- ఏమన్నారంటే?

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం కేసుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. అదో భయానక ఘటన అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలన్నారు. సోదరీమణులు, కూతుళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికాకుండా కాపాడాలన్నారు. ఈ అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరస్థులు మాత్రం దర్జాగా ఉన్నారన్నారు. సమాజం నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
READ MORE: Pothula Suneetha: వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
ఇదిలా ఉండగా.. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన డాక్టర్ భద్రను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. చివరకు సుప్రీంకోర్టు కలగజేసుకోవడంతో ఆందోళన విరమించారు. ఇప్పటికే డాక్టర్ల భద్రతను నిర్ధారించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓ కమిటిని ఏర్పాటు చేసింది. తాజాగా కేంద్రం డాక్టర్ల భద్రత కోసం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెల్త్ వర్కర్లకు, డాక్టర్లకు భద్రతను నిర్ధారించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు లేఖ రాసింది. వైద్య సంస్థల్లో వైద్యులపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనల్ని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి కేసులను నిరోధించడానికి వారికి ఆదేశాలు ఇచ్చింది.
[ad_2]