DK Shivakumar: ఆస్తుల కేసులో ఊరట.. డిప్యూటీ సీఎంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

[ad_1]
-
ఆస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట
డిప్యూటీ సీఎంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు గురువారం బిగ్ రిలీఫ్ లభించింది. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం సాధారణ క్లాజుల చట్టంలోని సెక్షన్ 21 కింద అనుమతిని రద్దు చేసింది. డీకే శివకుమార్‌పై విచారణను కొనసాగించాలంటూ న్యాయస్థానంలో రెండు పిటిషన్లలు దాఖలు అయ్యాయి. ఒకదాన్ని సీబీఐ దాఖలు చేయగా.. మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేశారు. వీటిని తాజాగా పరిశీలించిన ధర్మాసనం విచారణను కొసాగించేందుకు వీలు లేదంటూ రెండు పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఉప ముఖ్యమంత్రికి కోర్టులో ఊరట లభించినట్లయింది. కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు డీకే.శివకుమార్ తెలిపారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Perni Nani: ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదు.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
2013-18లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శివకుమార్ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో డీకే సంపాదనలో రూ.74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా 2020లో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: Eyes Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
[ad_2]