Trending news

Devara Song: ‘దేవర’ మూడో సాంగ్ వేరేలెవర్.. అంచనాలు పెంచేసిన లిరిసిస్ట్.. ట్వీట్ వైరల్..

[ad_1]

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా దేవర. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తారక్ పక్కా ఊర మాస్ పాత్రలో కనిపించనుండడంతో ఈ సినిమాపై అటు నార్త్‏లోనూ ఓ రేంజ్ హైప్ నెలకొంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈమూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ఇక కొన్నాళ్ల క్రితం విడుదలైన సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన చుట్టమల్లే పాట సోషల్ మీడియాలో ఏ రేంజ్ సెన్సెషన్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు ఇన్ స్టాలో ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేవర మూడో పాటపై అప్డేట్ ఇస్తూ అంచనాలు పెంచేశారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా దేవర మూడో సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చారు. “మూడో పాట పాటకు మించిన ఆట.. కన్నుల పండగ.. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు.. ఎప్పుడని అడక్కండి. ఎప్పుడొచ్చినా భీభత్సమే పక్కా.. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే” అంటూ ట్వీట్ చేయడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మూడో పాటలో ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోనుందని.. ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ పాటను విడుదల చేయనున్నారని సమాచారం. ఇక ఇటీవలే దేవర సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తారక్ డ్యూయేల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close