Devara Song: దేవర నుంచి మూడో సాంగ్.. ఎన్టీఆర్-జాన్వీ మాస్ డ్యుయెట్!

[ad_1]
- సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా దేవర విడుదల
- త్వరలోనే మూడో సాంగ్
- ఎన్టీఆర్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్

Devara 3rd Song Daavudi Comming Soon: ఇండియన్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేవర నుంచి మూడో సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
‘దేవర నుంచి థర్డ్ సింగిల్ దావుడి త్వరలోనే రిలీజ్ కానుంది. తారక్ అన్న, జాన్వీ కపూర్ దుమ్ములేపుతారు. కొరటాల శివ సర్ భారీ హిట్ కొడతారు’ అని అనిరుధ్ రవిచందర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్-జాన్వీ మధ్య మాస్ డ్యుయెట్ ఉంటుందని అనిరుధ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చుట్టమల్లె కంటే బాగుండాలని కోరుకుంటున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కొంచెం నవ్వు, మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తున్న తారక్ లుక్ షేర్ చేశారు.
Also Read: Mahesh Babu: బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’పై మహేష్ ప్రశంసలు!
‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా దేవర. ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది. ఈ మూవీతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
#Daavudi , next single from #Devara 🎉🎉🎉@tarak9999 anna and #JanhviKapoor on fire🕺💃🔥#KoratalaSiva sir ⚡️⚡️⚡️
— Anirudh Ravichander (@anirudhofficial) September 1, 2024
[ad_2]