Devara: కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.. కాస్కోమంటున్న దేవర

[ad_1]
పెద్ద పెద్ద సినిమాలు ట్రెండ్ కావడానికి చిన్న చిన్న కారణాలు సరిపోతాయి. కానీ ఇప్పుడు ఓ పెద్ద సినిమా ఒకేసారి బోలెడన్ని ఇంట్రస్టింగ్ విషయాలతో ఫ్యాన్స్ దిల్ఖుష్ చేస్తోంది. ఇంతకీ అన్ని విషయాలు ఏమున్నాయ్ దేవరా అంటారా? డీటైల్స్ మాట్లాడుకుందాం… పదండి..
దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. కానీ 27న వెరీ ఫస్ట్ షో ఎన్నిటికి పడుతుందో తెలుసా? వేకువజామున. ఒంటిగంటా ఎనిమిది నిమిషాలకు. ఓవర్సీస్లో ఈ టైమ్‌కే షోలు పడటానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మరి సేమ్ టైమ్‌కి మన దగ్గర కూడా రిలీజ్ అవుతుందా?
తెలంగాణలో తెల్లవారుజామున షోలు పడే కల్చర్ ఇప్పుడు లేదన్నది ఫ్యాన్స్ లో గుబులు పెంచుతున్న విషయం. అత్యంత భారీగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో స్పెషల్ పర్మిషన్లు తెచ్చుకుంటే, వరల్డ్ వైడ్ సేమ్ టైమ్‌కి షోలు పడే అవకాశం లేకపోలేదన్నది మరోవైపు ఊరట పెంచుతున్న విషయం.
దేవరలో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫొటోతో ఈ విషయం మీద ఓ రకంగా క్లారిటీ వచ్చిందనే అంటున్నారు క్రిటిక్స్. ఓ రకమైన నవ్వు, కాస్త పొడవు జుట్టు, కళ్లల్లో రౌద్రం, కాస్త పొట్టిన ఉన్న జుట్టూ.. .అంటూ రెండు పిక్స్ మధ్య తేడాలను కనిపెట్టే పనిలో పడ్డారు ఫ్యాన్స్.
వచ్చే నెల 27 రిలీజ్ కాబట్టి 30 రోజుల కౌంట్ డౌన్ మొదలైపోయింది. ప్యాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్లు ఎలా ప్లాన్ చేశారో… ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ వస్తున్న సినిమా కాబట్టి, ఆ ఫేమ్ కూడా బాగా ప్లస్ అవుతుంది. కాకపోతే పక్కా ప్లానింగ్‌తో క్యాష్ చేసుకోవాలంతే అంటూ… ఆ రకంగానూ డిస్కషన్ షురూ చేస్తున్నారు నియర్ అండ్ డియర్స్.
[ad_2]