Deputy CM Pawan Kalyan visit to Kurnool district tomorrow..
[ad_1]
- కర్నూలు జిల్లాలో రేపు పవన్ కల్యాణ్ పర్యటన..
- గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించనున్న పవన్..
- ప్రాజెక్టును అన్ని వైపుల నుంచి పరిశీలించనున్న డిప్యూటీ సీఎం..
- ఆసియాలోనే అతిపెద్దదైన పిన్నాపురం గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు..
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు. ఉదయం 11.30 కి కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు, నిర్మాణంలో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు డిప్యూటీ సీఎం… 15 వేల కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఇన్ టేక్ వ్యూ పాయింట్, పవర్ హౌస్ దగ్గరి నుంచి పరిశీలిస్తారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కల్యాణ్ కు వివరిస్తారు. ఇక, కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. ఆస్తి వివాదంలో జర్నలిస్ట్ కుటుంబం హత్య
[ad_2]