Trending news

Deputy CM Bhatti Vikramarka: మున్నేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం

[ad_1]

  • మున్నేరు వరద ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు..

  • పంట నష్టం అంచనాలు -నివేదిక పంపాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు..
Deputy CM Bhatti Vikramarka: మున్నేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాలలో మున్నేరు వరద ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వరద నీరు వచ్చిన ఇండ్లను పరిశీలించి వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధైర్యం చెప్పారు. పండ్రేగుపల్లి లో మున్నేరు కరకట్ట తెగి ఇండ్లలోకి నీరు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ కాలనీని సందర్శించారు. పండ్రేగుపల్లి లో వర్షాలకు దెబ్బతిని కూలిపోయిన వజీర్ పాషా రేకుల ఇంటిని పరిశీలించి బాధితులకు మనోధైర్యం చెప్పారు.

Read also: Minister Ponnam Prabhakar: హిమాయత్ సాగర్ జలాశయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్…

పండ్రేగుపల్లి లో కరకట్ట తెగి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరద ముంపు బాధితులకు తక్షణ సాయం కింద నిత్యవసర సరుకులను అందజేయాలని తహసిల్దార్ కరుణాకర్ రెడ్డిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాథమికంగా పంట నష్టం అంచనాలు తయారుచేసి నివేదిక పంపాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా.. రేవంత్‌ రెడ్డి చిట్ చాట్



[ad_2]

Related Articles

Back to top button
Close
Close