Trending news

Darshan: దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా? రేణుకా స్వామి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

[ad_1]

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీని మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. దీనికి సంబంధించి బుధవారం (ఆగస్టు 28) న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే ఈ కేసులో మొదటి ముద్దాయి పవిత్ర గౌడ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ కూడా జరిగింది. విచారణ సందర్భంగా, బెయిల్‌ను వ్యతిరేకించిన ఎస్‌పీపీ ప్రసన్న కుమార్, రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలను  కోర్టు ముందు ఉంచారు. దీని ప్రకారం రేణుకా స్వామి నటి పవిత్రకు మెసేజ్ పంపగా, పవిత్ర గౌడ ఆ మొబైల్ నంబర్‌ను నిందితుడు పవన్‌కు ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రేణుకా స్వామిని మభ్యపెట్టారు. ఆచూకీ తెలుసుకున్నారు. ఆ తర్వాత చిత్రదుర్గకు చెందిన రాఘవేంద్ర, వినయ్, జగ్గా, అను, రవి సాయంతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.

రేణుకా స్వామిని ఒక పాడు బడిన షెడ్డు వద్దకు తీసుకొచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు. పవన్ వెళ్లి స్టోనీ బ్రూక్ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకుంటున్న దర్శన్‌కి ఈ విషయాన్నిచేరవేశాడు. అనంతరం నిందితుడు ఏ10 వినయ్‌, నిందితుడు ఏ14 ప్రదోష్‌ను తీసుకెళ్లిన దర్శన్ పవిత్రగౌడ్ ఇంటికి వెళ్లారు. అక్కడున్న నల్లరంగు స్కార్పియోలో రేణుకాస్వామిని పట్టనగెరె షెడ్డుకు తీసుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

దర్శన్, పవిత్ర, వినయ్, ప్రదోష్ తమ ఇష్టానుసారం రేణుకా స్వామిపై దాడి చేస్తారు. వెదురు కర్రలతో కొట్టారు. రేణుకా స్వామి బట్టలు చింపేశారు. మర్మాంగంపై కూడా దాడి చేశారు. రేణుకా స్వామి ధరించిన బంగారు ఆభరణాలు, చేతి గడియారాలు తీసేసుకున్నారు. దర్శన్ అండ్ కో గ్యాంగ్ దాడిలో రేణుకా స్వామి ఊపిరితిత్తుల ఎముకలు విరిగిపోయాయి. అలాగే అంతర్గతంగా పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి, హత్య కుట్రలో పవిత్ర గౌడ కూడా ఉండడం యాదృచ్చికం. ఈ కారణంతోనే ఆమెకు బెయిల్ మంజూరు చేయలేమని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు.

త్వరలోనే బళ్లారి జైలుకు దర్శన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close