Darshan : ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా.? దర్శన్‌కు గట్టిదెబ్బే పడిందిగా

[ad_1]
ర్నాటకలో నటుడు దర్శన్ వ్యవహారం దుమారం రేపుతోంది. దర్శన్‌కు జైలులో సకల మర్యాదలు జరుగుతున్నట్టు ఫొటోలు, వీడియోలు బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారడంతో దర్శన్ వ్యవహారంపై జైళ్ల శాఖలో భారీ కుదుపు మొదలైంది. అసలు దర్శన్ రాజభోగాల వీడియో లీక్ చేయడం వెనుక ఉన్నదెవరు? ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా? అంటే అవుననే అంటున్నారు. ఇద్దరు ఖైదీల మధ్య గొడవ కారణంగానే దర్శన్ వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ ఇద్దరు ఖైదీల్లో ఒకరికి దగ్గరకు ఫోన్ ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు సస్పెన్స్. ఫోన్ వినియోగానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు?
ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..
మరోవైపు వీడియోల లీక్ దుష్రచారమని కొట్టిపారేస్తోంది కర్నాటక ప్రభుత్వం. అయితే దర్శన్ యవ్వారంలో పోలీసు శాఖ తీరును చాలామంది తప్పుబట్టారు. దీంతో ఉన్నాతాధికారులు, విచారణకు ఆదేశించారు. దర్శన్ తోపాటు రౌడీ షీటర్లు విల్సన్ గార్డన్, శ్రీనివాస్, మేనేజర్ నాగరాజు కలిసి జైలులో పార్టీ చేసుకోవడంపై దృష్టి సారించింది. పార్టీ చేసుకోవడానికి అనుమతి ఎవరు ఇచ్చారు? కాపీ, సిగరెట్లు ఎలా సమకూర్చారు? అనేదానిపై ఫోకస్ చేశారు. జైలులో సెల్‌ఫోన్లు వినియోగం, నెట్ కనెక్షన్, వీడియో కాల్స్ పై ఆరా తీస్తున్నారు. అత్యంత భద్రత కలిగిన బ్యారక్‌లో నటుడు దర్శన్ మాత్రమే ఉంటాడు. ఒకవేళ ఆయనను చూడటానికి ఫ్యామిలీ వచ్చినా ఖాళీ ప్రదేశంలో కలిసేవారు. బ్యారక్ లోపలికి వెళ్ల నిచ్చేవారు కాదు. కానీ రౌడిషీటర్ విల్సన్ గార్డన్ నేరుగా దర్శన్ బ్యారక్ లోకి వెళ్లడం.. లోపలున్న ఖైదీలంతా దర్శన్ సేవలో నిమగ్నమైనట్టు ఫోటోలో కనిపించడంతో రచ్చ రేగింది.
ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే
మరోవైపు పరప్పన ఆగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారి జైలుకు షిప్టింగ్ ఆడర్డ్ ఇచ్చింది కోర్టు. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. వీరిని వేర్వేరు జైళ్లకు తరలించారు. పవిత్రా గౌడ, అనుకుమార్, దీపక్‌లను పరప్ప అగ్రహార జైలులోనే ఉంచారు. ఇక బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న దర్శన్ కోసం కుటుంబ సభ్యులు కలిసేవారు. రెండు మూడు గంటల్లోనే పరప్ప అగ్రహారానికి వెళ్లి దర్శన్‌తో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కానీ, ఇప్పుడు దర్శన్‌ని బళ్లారికి షిఫ్ట్ చేస్తే.. కుటుంబసభ్యులు కలవడం కష్టమే. బళ్లారి జైలులో రూల్స్ కఠినంగా ఉంటాయి. మరోవైపు దర్శన్ సహా నిందితుల కష్టడి పొడిగించింది కోర్టు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]