Trending news

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

[ad_1]

  • సీఎం షెడ్యూల్‌లో ఇవాళ స్వల్ప మార్పులు..

  • ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

CM Revanth Reddy: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న(సోమవారం) ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈరోజు ఆయన మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలం తిరుమలాయపాలెం వంతెన, నెల్లికుదురు మండలం రావిరాల వద్ద ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉంది. అయితే సీఎం షెడ్యూల్‌లో ఇవాళ స్వల్ప మార్పులు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించారు. ఇవాళ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. కారేపల్లి మండలం గంగారం తండాలో మృతి చెందిన డాక్టర్ అశ్విని, ఆయన తండ్రి మోతీలాల్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. సీతారాంనాయక్ ఖమ్మం నుంచి నేరుగా తాండాకు చేరుకుంటారు. సుమారు 100 మంది పోలీసులు గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో రక్షించారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆ తర్వాత తిరుమలపాలెం వంతెన, రావిరాల గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది.
TGS RTC: భారీ వానలు.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close