Chit fund Fraud: రూ.10 కోట్ల చీటీల సొమ్ముతో పరార్.. ఆందోళన చేపట్టిన బాధితులు

[ad_1]
- విశాఖలోని గాజువాకలో రూ.10 కోట్ల చీటీల సొమ్ముతో ఓ వ్యక్తి పరారీ
- గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన

Chit fund Fraud: విశాఖలోని గాజువాకలో భారీ మోసం జరిగింది. చిట్టీలు నడిపే ఓ వ్యక్తి డబ్బులు కట్టిన వారిని మోసం చేసి పరారయ్యాడు. దాదాపు 60 మంది సభ్యులకు సంబంధించిన రూ.10 కోట్ల చిట్టీ డబ్బులతో పరారయ్యాడు. గాజువాకలోని వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన మరడన పరుశురాం చీటీల పేరుతో సుమారు రూ.10 కోట్లతో పరారీ అయ్యాడని భాదితులు శుక్రవారం ఉదయం గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వాంబేకాలనీ, ప్రియదర్శిని కాలనీ, బాపూజీ కాలనీ, సంజీవ్ గిరి కాలనీ, వికాస్ నగర్, గాజువాక ప్రాంతాలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాలలో పలు చీటీలు, రియల్ ఎస్టేట్ పేరుతో పేరుతో సుమారు రూ 10 కోట్లతో పరార్ అయ్యాడని బాధితులు ఆందోళన చేపట్టారు. నిందితుడు గతంలో అగ్రిగోల్డ్‌లో పని చేశాడని ఆ పరిచయాలు మీద అందరూ చీటీలు కట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చెమటోడ్చి చిట్టీలు కడితే మొత్తం తీసుకుని పరారయ్యాడని పోలీసుల ముందు వాపోయారు బాధితులు.
Read Also: Weather Alert: గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం.. 6 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్
[ad_2]