Trending news

Chandrababu Tweet: సారీ బాలయ్య.. సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు రాలేకపోతున్నాను..

[ad_1]

  • సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ బాలకృష్ణకు శుభాకాంక్షలు..

  • ఏపీలో భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను..

  • నందమూరి బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలి: సీఎం చంద్రబాబు
Chandrababu Tweet: సారీ బాలయ్య.. సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు రాలేకపోతున్నాను..

Chandrababu Tweet: ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న వరద సంభవించడంతో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పర్యటించి.. సహాయక చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష మందికి ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, రేపు ( సోమవారం ) సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక, నందమూరి బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close