Trending news

Champions Trophy 2025: ఐసీసీ ఛైర్మన్‌గా పాక్ పని పట్టేందుకు సిద్ధమైన జైషా.. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై కీలక నిర్ణయం

[ad_1]

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరగనుందనే చర్చ జరుగుతోంది. అయితే భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే సందేహం నెలకొంది. అందుకే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలనే చర్చ మొదలైంది. ఆసియా కప్ టోర్నీ కూడా ఇదే హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది. అయితే ఈసారి ఏమైనా పాకిస్థాన్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని పీసీబీ చెబుతోంది. ఈ మొండి వైఖరి విస్మయానికి గురి చేస్తోంది. కాగా తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఐసీసీ అధికార పీఠం ఇప్పుడు జై షా చేతుల్లోకి వెళ్లింది. ఇది పాకిస్థాన్‌కు పెద్ద సమస్యగా మారింది. డిసెంబరు 1, 2024 నుంచి జై షా అధ్యక్షుడిగా ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఇది పాకిస్థాన్‌కు ఇబ్బందిగా మారడం ఖాయం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొనగా మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ రౌండ్‌లో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాబట్టి రెండు మ్యాచ్‌లు సెమీ ఫైనల్, ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటాయి. భారత్‌, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ ఇప్పటికే రూ.586 కోట్లు మంజూరు చేసింది. అయితే పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే 45 లక్షల డాలర్లు అదనంగా చెల్లించింది. అంటే రూ.37.67 కోట్ల అదనపు బడ్జెట్ ఉంచారు. సో హైబ్రిడ్ మోడల్‌కు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌పై టోర్నీ జరిగితే దుబాయ్‌లో భారత్ లో మ్యాచ్ లు నిర్వహించే అవకాశముంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్

  • ఫిబ్రవరి 19, పాకిస్థాన్ vs న్యూజిలాండ్ (కరాచీ)
  • ఫిబ్రవరి 20, భారత్ vs బంగ్లాదేశ్ (లాహోర్)
  • ఫిబ్రవరి 21, ఆఫ్ఘనిస్తాన్ vs సౌత్ ఆఫ్రికా (కరాచీ)
  • ఫిబ్రవరి 22, ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (లాహోర్)
  • ఫిబ్రవరి 23, న్యూజిలాండ్ vs ఇండియా (లాహోర్)
  • ఫిబ్రవరి 24, పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి)
  • ఫిబ్రవరి 25, ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (లాహోర్)
  • ఫిబ్రవరి 26, ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (రావల్పిండి)
  • ఫిబ్రవరి 27, బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (లాహోర్)
  • ఫిబ్రవరి 28, ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (రావల్పిండి)
  • మార్చి 1, భారత్ vs పాకిస్థాన్ (లాహోర్)
  • మార్చి 2, దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ (రావల్పిండి)
  • మార్చి 5, సెమీ ఫైనల్ 1 (కరాచీ)
  • మార్చి 6, సెమీ ఫైనల్ 2 (రావల్పిండి)
  • మార్చి 9, ఫైనల్ (లాహోర్)

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close