Cases Are Also Being Registered On Posts Made On Social Media: Kakani Govardhan Reddy

[ad_1]
- సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేస్తున్నారు..
- పోలీస్ వ్యవస్థపై విశ్వాసం ఉండటంతోనే విచారణకు వెళ్లాను..
- మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి తాట తీస్తాం: కాకాణి గోవర్థన్ రెడ్డి

Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉండటం వల్లే విచారణకు వచ్చాను అని తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి చేసిన అవినీతి గురించి వాట్సాప్ లో పోస్ట్ పెట్టడంతోనే నా పైనా కేసు పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 54 ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ఇక, మద్యం, ఇసుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు దోచుకుంటున్నాడు అని మాజీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌పై కొడుకు దాడి
ఇక, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాకు రాజకీయ ప్రత్యర్ది.. అయనపై రాజీలేని పోరాటం చేస్తానని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. సోమిరెడ్డితో పాటు ఆయన కొడుకు భరతం పడతామన్నారు. ఒక్కొక్కరి తాట తీస్తాం.. సోమిరెడ్డికి అనుకూలంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు.. పోలీసుల రికార్డు కూడా నా దగ్గర ఉంది.. వైసీపీ నేతల పైనా, కార్యకర్తల పైనా అనుచిత పోస్టులు పెడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరి పైనా కేసులు పెడతామని కాకాణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు.
[ad_2]