Case Filed on Posani Krishna Murali

[ad_1]
- పోసాని కృష్ణమురళిపై విజయవాడలో కేసు నమోదు
పోసానిపై జనసేన నాయకులు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

ప్రముఖ నటుడు, వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి కొత్త చిక్కులు మొదలయ్యాయి. పోసాని కృష్ణమురళిని 2022 నవంబర్ 03న ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు.
Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం
ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద విజయవాడ లో కేసు నమోదు అయింది. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళిపై.. జనసేన నాయకులు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోసాని మురళికృష్ణ పై కేసు నమోదు చేశారు భవానీపురం పోలీసులు.
[ad_2]