Trending news

Bus Accident: ఎద్దును కాపాడే ప్రయత్నంలో ఘోరం.. బస్సు అదుపు తప్పి బోల్తా..

[ad_1]

18 People Injured As Bus Over Turns In Up Shahjahanpur

18 people injured as bus over turns in UP Shahjahanpur: ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. ఎద్దును కాపాడే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. షాజహాన్‌ పూర్‌ జిల్లా సీతాపూర్‌ నుంచి హరిద్వార్‌ కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు జాతీయ రహదారిపై ఎద్దును కాపాడే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. వారందరికి చికిత్స జరుగుతోంది. దీని గురించి సమాచారం ఇస్తూ పోలీస్ ఏరియా ఆఫీసర్ సౌమ్య పాండే మాట్లాడుతూ.., సీతాపూర్ నుండి ఒక బస్సు ప్రయాణికులతో హరిద్వార్‌కు వెళుతోందని తెలిపారు. గురువారం రాత్రి 1 గంట ప్రాంతంలో ఠాణా రామచంద్ర మిషన్ ప్రాంతంలోని హైవేపైకి బస్సు చేరుకోగా ఒక్కసారిగా ఎద్దు బస్సు ఎదురుగా వచ్చింది.

Professor Dance: మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన మహిళా ప్రొఫెసర్లు.. (వీడియో)

ఎద్దును కాపాడే ప్రయత్నంలో డ్రైవర్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనే బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారని తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారిని ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. హర్దోయ్ బైపాస్ సమీపంలో యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ కేసులో ప్రయాణికుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. అకస్మాత్తుగా ఎద్దు రోడ్డుపైకి వచ్చిందని, డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినా బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు.

POSCO Case: దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close