Trending news

BTS Jungkook: BTS జంగ్‌కూక్ ఎంత సంపాదించాడో తెలుసా.. ? అత్యంత అందమైన కుర్రాడి ఆస్తులు తెలిస్తే షాకే..

[ad_1]

BTS Jungkook: BTS జంగ్‌కూక్ ఎంత సంపాదించాడో తెలుసా.. ? అత్యంత అందమైన కుర్రాడి ఆస్తులు తెలిస్తే షాకే..

BTS బ్యాండ్.. పాప్ మ్యూజిక్ లవర్స్ కు పరిచయం అవసరంలేని పేరు. ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యధిక పాలోవర్స్ ఉన్న బ్యాండ్ కూడా ఇదే. ఈ సౌత్ కొరియన్ బ్యాండ్ కు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఏడుగురు కుర్రాళ్లు తమ సంగీతంతో ప్రపంచాన్ని ఊర్రుతలూగించారు. తమ పాటలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను పరవశింపజేస్తుంది. 2013లో చిన్న గదిలో ఏడుగురు సభ్యులతో కలిసి మొదలైన మ్యూజిక్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తుంది. వరల్డ్ లోనే రిచెస్ట్ బ్యాండ్ గా బీటీఎస్ పేరు ప్రఖ్యతలు సంపాదించుకుంది. ఈ బృందంలో జియోన్ జంగ్ కూక్ ఒకరు. అభిమానులు అంతా అతడిని జంగ్ కూక్ అని పిలుచుకుంటారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీటీఎస్ బ్యాండ్ గ్రూపులో చేరి ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు. జంగ్ కుక్ కు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

ఇదిలా ఉంటే.. జంగ్ కూక్ ఇప్పటివరకు రూ.290 కోట్లు ఆస్తులు సంపాదించాడు. బీటీఎస్, అతడి సోలో ప్రాజెక్ట్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లతో ఇంత మొత్తంలో సంపాదించిన్నట్లు సమాచారం. జంగ్ కూక్ సంగీతం ద్వారానే ప్రంపచానికి పరిచయం అయ్యాడు. 2013లో బీటీఎస్ బ్యాండుతో మొదలైన ప్రయాణం ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ పాటలతో అతడిని కోట్లాది మంది హృదయాల్లో నిలిపింది. 2023లో, జంగ్‌కూక్ తన మొదటి సోలో ఆల్బమ్, గోల్డెన్‌ని కూడా విడుదల చేశాడు, ఇందులో “స్టాండింగ్ నెక్స్ట్ టు యు,” “3డి,” “సెవెన్” వంటి పాటలు ఉన్నాయి.

బీటీఎస్ బ్యాండుతో కలిసి “డైనమైట్,” “బటర్,” “పర్మిషన్ టు డ్యాన్స్” వంటి పాటలతో చాలా పాపులర్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితమే జంగ్ కూక్ దక్షిణ కొరియాలో ఆర్మీ సేవను పూర్తిచేశాడు. జంగ్‌కూక్ అనేక ఛానెల్‌ల ద్వారా డబ్బు సంపాదిస్తాడు. ఆల్బమ్‌లు, సింగిల్స్, మ్యూజికల్ ఈవెంట్స్. కాల్విన్ క్లైన్ వంటి పెద్ద బ్రాండ్‌లతో ఆమోదాలు కలిగి ఉన్నాడు. అతని సంగీతాన్ని ప్లే చేయడం లేదా ఉపయోగించడం ద్వారా వచ్చే ఆదాయాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by BTS official (@bts.bighitofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Source link

Related Articles

Back to top button
Close
Close