Trending news

BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్ ప్లాన్.. తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీ!

[ad_1]

  • భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్‌లు
  • బీఎస్‌ఎన్‌ఎల్‌కు షిఫ్ట్ అవుతున్న యూజర్లు
  • 160 రోజుల వ్యాలిడిటీ
BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్ ప్లాన్.. తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఇటీవల భారీగా పెంచడంతో.. చాలామంది యూజర్లు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు షిఫ్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. తమ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రూ.997 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

Also Read: Moto G55 Launch: మోటో నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్స్ అదుర్స్, ధర తక్కువే!

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జ్ ప్లాన్ రూ.997 వ్యాలిడిటీ 160 రోజులు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం ఉంది. జింగ్ మ్యూజిక్, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ యాప్‌ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీసులను అందించే ప్రతి సర్కిల్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close