BSNL New Plans: బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్.. ఐదు నెలల ప్లాన్.. ఎన్నో ప్రయోజనాలు

[ad_1]
- ఐదు నెలలకు భారీ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్..
-
రూ. 397 ప్లాన్ తో 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్.. -
దేశ్య వ్యాప్తంగా 2025 మార్చి వరకు అదుబాటులోకి బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసు..

BSNL New Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను మరోసారి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ పాతాది అయినప్పటికి.. ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఈ ప్లాన్ 180 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేది అన్నమాట. రోజుకి 2జీబీ డేటా.. 60 రోజుల పాటు అన్ లిమిటెట్ ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభించేది. అయితే, ఇవన్నీ ఇప్పుడు 30 రోజులకు కుదించింది. కానీ వినియోగదారులు 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందే ఛాన్స్ ఇచ్చింది.
Read Also: PM Modi: శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ
ఇక, ఇన్‌కమింగ్ కాల్స్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. అయితే 30 రోజుల తరువాత డేటా, ఎస్ఎమ్ఎస్ ఆప్షన్స్ వంటివి దొరకవు.. కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన తరువాత.. బీఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా పుంజుకుంటోంది. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో మునిగిపోయింది. కంపెనీ 4జీ సర్వీసును కూడా 2025 మార్చి నాటికి దేశ్య వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అయింది.
[ad_2]