Black Grape Juice: నల్ల ద్రాక్ష రసంతో జుట్టు, చర్మం మెరుస్తాయి.. ఇంకా ఎన్నో లాభాలు..

[ad_1]
నల్ల ద్రాక్ష గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి చాలా మందికి తెలుసు. ద్రాక్షలో చాలా రకాలు ఉంటాయి. కానీ ఎక్కువగా అందరూ పచ్చ రంగు ద్రాక్షనే తినేందుకు ఆసక్తి చూపిస్తారు. నల్ల ద్రాక్ష పుల్లగా ఉంటుందని పెద్దగా తినరు. కానీ వీటితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. నల్ల ద్రాక్షతోనే కాదు వీటి రసం తీసుకోవడం వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ ఓ కప్పు నల్ల ద్రాక్ష రసం తాగడం వల్ల క్యాన్సర్, బీపీ, షుగర్, గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందులో క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ద్రాక్ష రసం తాగడం వల్ల చర్మం, జుట్టు కూడా ఎంతో అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తాయని అంటున్నారు. మరి ఈ ద్రాక్ష రసాన్ని తాగడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా:
బ్లాక్ గ్రేప్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభిస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ని నశింప చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడతాయి. అదే విధంగా తక్షణమే శక్తి కూడా లభిస్తుంది.
యంగ్‌గా ఉంటారు:
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. చర్మం అందంగా ఉంటుంది. వృద్ధాప్య లక్షణాలు దరి చేరకుండా చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు లేకుండా క్లియర్‌గా ఉంచుతుంది. బ్లాక్ గ్రేప్ జ్యూస్‌ని పది రోజులు కంటిన్యూ తాగండి.. ఫలితం మీకే కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
ఇతర ద్రాక్ష పండ్ల కంటే నలుపు రంగులో ఉండే ద్రాక్ష పండ్లు లేదా జ్యూస్ తాగడం వల్ల గుండెకు ఎంతో మంచిది. ఇందులో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు.. గుండెపై ఒత్తిడి పడకుండా చూస్తాయి. గుండె సంబంధిత జబ్బులతో కూడా పోరడతాయి.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది:
నల్ల ద్రాక్ష రసం తాగడం వల్ల రక్తంలోని చెడు కొవ్వును కరిగించి.. మంచి కొవ్వును పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే రక్తం కూడా శుభ్ర పడుతుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. అధిక బరువు కూడా తగ్గుతారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]