Bigg BossTelugu 8: బిగ్‌బాస్ 8 ప్రసార తేదీ వచ్చేసింది.. హోస్ట్‌గా కింగే!

[ad_1]
- బిగ్‌బాస్ ప్రసార తేదీ వచ్చేసింది
- సెప్టెంబర్ 1 నుంచి సీజన్ 8 ఆరంభం
- హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్

Bigg Boss Telugu 8 Start Date 2024: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు 8 ప్రసార తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సీజన్ 8 ఆరంభం అవుతుందని స్టార్ మా, డిస్నీ+ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించాయి.ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సీజన్ 8 నుంచి హోస్ట్‌గా ‘కింగ్’ నాగార్జున తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో ఏ నిజం లేదని తాజాగా విడుదలైన పోస్టర్‌తో స్పష్టమైంది.
Also Read: Allu Arjun-Atlee: అట్లీతో బన్నీ సినిమా.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు స్టార్ మాలో బిగ్‌బాస్ 8 తెలుగు ప్రసారం కానుంది. శనివారం, ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్ కానుంది. ‘ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కి లిమిటే లేదు’ అని పోస్టర్‌లో ఉంది. కింగ్ నాగార్జున సరికొత్త గెటప్‌లో ఉన్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతేడాది సక్సెస్ కావడంతో.. ఈ సీజన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
[ad_2]
Source link