Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఆ కంటెస్టెంట్స్‌ను గుర్తు పట్టారా? మొత్తానికి భలే ట్విస్ట్ ఇచ్చారుగా..

[ad_1]
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివార (సెప్టెంబర్ 1) సాయంత్రం 6 గంటల నుంచే బిగ్ బాస్ సందడి షురూ కానుంది. దీనికి సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజా ప్రోమోలో హోస్ట్ నాగార్జున అల్ట్రా మోడ్రన్ లుక్ తో చాలా స్టైలిష్ కనిపించారు. ఇక షో లాంఛింగ్ కు సరిపోదా శనివారం టీమ్ హాజరైంది. హీరో నాని, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ వచ్చి బిగ్ బాస్ షోను మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు. అలాగే 35- ఇది చిన్న కథ కాదు టీమ్ కూడా బిగ్ బాస్ షోలో తళుక్కుమంది. ఈ సినిమా నిర్మాత నటుడు దగ్గుబాటి రానా, హీరోయిన్ నివేదా థామస్ హౌస్ లో సందడి చేశారు. ఇక డైరెక్టర్ అనిల్ రావి పూడి కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. కాగా ఈ ప్రోమోలో పలువురు కంటెస్టెంట్స్ వచ్చినా వారిని కనిపించకుండా చేశారు. కేవలం వాళ్ల మాటలనే వినిపించారు. ‘నేను మాత్రం మీ కళ్లల్లోకి చూసి మాట్లాడలేను.. ఎందుకంటే.. ఆ కళ్లల్లోకి చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సార్’ అన్న మాటలను బట్టి చూస్తే కచ్చితంగా బేబక్కే అని తెలుస్తోంది. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇలాగే పులి హోర కలపింది.
ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఎవర్నైనా పార్టనర్‌ని వెతుక్కుంటున్నావా? అని సీరియల్ నటుడు నిఖిల్ ని అడిగినట్లున్నారు హోస్ట్ నాగార్జున. ఇక ‘నన్ను శత్రువులా చూస్తే మాత్రం బిగ్ బాస్ టైటిల్ పట్టుకుపోతా’ అంటూ ఇతర కంటెస్టెంట్‌కి వార్నింగ్ ఇచ్చింది మరెవరో కాదు ఆర్జే శేఖర్ భాషా. ఇక నాగార్జున ఓ కంటెస్టెంట్‌తో ఈ అమ్మాయి చూడ్డానికి ఫ్లవర్‌లా ఉంటుంది కానీ.. లోపల చాలా ఫైర్ ఉంది అని అంటున్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు.. ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ఫేమ్ యష్మీ గౌడ అని తెలుస్తోంది. ‘నాకు భయం అని తెలుసు.. కానీ హ్యాండిల్ చేస్తాను’ అంటూ ఇటీవలే బిగ్ బాస్ ఎంట్రీపై ఒక పోస్ట్ పెట్టిందీ అందాల తార.
ఇవి కూడా చదవండి
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ఇదిగో..
🔥 🔥 The moment you’ve all been waiting for is finally here! Bigg Boss Telugu Season 8 is kicking off tonight at 7:00 PM with Nagarjuna at the helm. Special guests Nani and Rana Daggubati will add extra star power to the grand launch only on #Disneyplushotstartelugu and @StarMaa… pic.twitter.com/ljvcs7DdMj
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 1, 2024
కొత్త సీజన్ లో సూపర్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇన్నాళ్లు ఫస్ట్ వీక్ జరిగే ఎలిమినేషన్ ఈ సారి ఏకంగా ఫస్ట్ డే నే జరగబోతుంది. దీనిపై స్టార్ డైరెక్టర్ అనిల్ రావి పూడి ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చాడు. అంటే మొదటి రోజు నుంచే బిగ్ బాస్ యమా రంజుగా సాగుతుందన్నమాట.
ఈ సారి బిగ్ బాస్ హౌస్ చూశారా?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]