Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో.. రెండు గ్రామాలను దత్తత తీసుకుని హౌస్‌లోకి ఎంట్రీ..

[ad_1]
బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఐదో కంటెస్టెంట్ గా ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ఓం ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిశాడు. హీరోగానే కాకుండా విలన్ గానూ తన ట్యాలెంట్ చూపించాడు. అయితే దురదృష్టవశాత్తూ ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేక పోయాడు. ఇప్పటికీ ఆదిత్య ఓం సినిమాలు చేస్తున్నాడు. వీటికి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు వస్తున్నాయి. కానీ కమర్షియల్ గా ఫెయిల్ అవుతున్నాయి. కాగా చేతిలో సినిమాలు లేని సమయంలో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట ఈ ట్యాలెంటెడ్ హీరో. కనీసం గది నుంచి బయటకు కూడా రాలేకపోయాడట. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగాడట. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో మానసిక ఒత్తిడిని అధిగమించి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాడట.
సినిమాల సంగతి పక్కన పెడితే ఆదిత్య ఓం రియల్ హీరో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలా మందికి తెలియవు. ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడట ఆదిత్య ఓమ్. అక్కడ ఉండే దాదాపు 500 మందికి తన వంతు ఆర్థిక సాయం చేశాడట.
ఇవి కూడా చదవండి
ఐదో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆదిత్య ఓం..
Catch Aditya Om’s electrifying entrance on #BiggBossTelugu8! 🌟 Witness the drama, the energy, and the excitement as he makes his mark. Tune in every night at 9:00 PM and 9:30 at weekend on @DisneyPlusHSTel and #StarMaa #AdityaOMonBB8 pic.twitter.com/qPGRcgzVQ7
— Starmaa (@StarMaa) September 1, 2024
అంతేకాదు అక్కడి పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడట. ఇలా సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటోన్న ఆదిత్యం ఓం బిగ్ బాస్ షోతో మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఈ హౌస్ లో అతను ఏమేర జనాలను ఎంటర్ టైన్ చేస్తాడో.
నటుడు ఆదిత్య ఓం లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]