Bigg Boss 8 Telugu: చివరి నిమిషంలో బిగ్బాస్కు హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు.. ఆ యూట్యూబర్కు బంపర్ ఆఫర్..

[ad_1]

బుల్లితెర అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఈరోజు హౌస్ లోకి 14 మంది అడుగుపెట్టనున్నారు.. అందులో ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు ఉండనున్నారు. అయితే ఈసారి హౌస్ లోకి సోలో ఎంట్రీ కాకుండా జంటగా పంపిస్తున్నారు. ప్రేరణ, యష్మి, బెజవాడ బేబక్క , కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్ మరికాసేపట్లో హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే వీళ్లంతా కేవలం ప్రోమో ప్రకారం మాత్రమే తెలుస్తోంది. అయితే వీళ్లంతా జంటగా ఉంటారా..? లేదా ? తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్బాస్ చివరి నిమిషంలో ఓ కంటెస్టెంట్ ఆగిపోయాడని తెలుస్తోంది.
మొత్తం 14 మందిలో నటుడు పరమేశ్వర్ హివ్రాలే పేరు కూడా గట్టిగా వినిపించింది. కట్ చేస్తే చివరి నిమిషంలో అతడు షో నుంచి సైడ్ అయిపోయాడని టాక్ వినిపిస్తుంది. పదేళ్లుగా తెలుగు సినీరంగంలో ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అంతగా గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సినిమాల్లో నటించాడు. చిరు గొడవలు, కుమారి 18+, లావణ్య విత్ లవ్ బాయ్స్, జాతీయ రహదారి సినిమాల్లో నటించాడు. ఎల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడి గుమ్మడి నర్సయ్య బయోపిక్ కు దర్శకత్వం వహించారు.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంతో బిగ్బాస్ షో స్టార్ట్ కాకముందే చివరి నిమిషంలో ఆగిపోయాడట. దీంతో అతడి స్థానంలోకి యూట్యూబర్ నబీల్ అఫ్రిదిని తీసుకువస్తున్నారు. ఈయన షరతులు వర్తిస్తాయి అనే మూవీలోనూ యాక్ట్ చేశాడు. మరి ఈ యూట్యూబర్ ఈ షోను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]