Bhatti Vikramarka: థర్మల్ పవర్ ప్లాంట్ కోసం స్థల పరిశీలన.. రామగుండంలో భట్టి విక్రమార్క పర్యటన

[ad_1]
- రామగుండంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన..
- తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ స్థల పరిశీలన..

Bhatti Vikramarka: పెద్దపల్లి జిల్లా రామగుండంలో నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు రామగుండం పోలీస్ కమిషనరెట్ లోని హెలీప్యాడ్ వద్దకు భట్టి విక్రమార్క ,పొన్నం, శ్రీధర్ బాబు చేరుకోనున్నారు. రామగుండం చేరుకోగానే తొలుత తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ స్థలం పరిశీలించనున్నారు. రామగుండం నుంచి సింగరేణి ఆర్జీ 1 ఏరియా లోని మేడిపల్లి మిని ఓసిపి పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి రామగుండం సెక్టార్ 2 లో స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో అమృత్ 2.0 పథకం, టి.యూ.ఎఫ్.ఐ.డి.సి అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. భట్టితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.
Read also: Robert Vadra : కంగనా రనౌత్‌కు పార్లమెంట్‌లో ఉండే అర్హత లేదు.. ఆమె ప్రకటనపై రాబర్ట్ వాద్రా ఆగ్రహం
కాగా.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. జెన్‌కో ప్రతిపాదిత పవర్‌ప్లాంట్‌ను నిర్మించడం వల్ల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు సుమారు 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జేఏసీ నాయకులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థను పటిష్టం చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తక్కువ ధరకు ప్రజలకు విద్యుత్ అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారిగా దశాబ్దాల చరిత్ర కలిగిన 62.5 మెగావాట్ల రామగుండం-బి థర్మల్ పవర్ ప్లాంట్ మూతపడనుంది.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం 1978లో ఎన్‌టిపిసికి శంకుస్థాపన చేసింది, దాని సరిహద్దుకు ఆనుకుని బి-థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన 13 సంవత్సరాల తర్వాత. 1983లో కేవలం 200 మెగా వాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన కార్పొరేషన్ ఇప్పుడు దశలవారీ విస్తరణతో 2600 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుని యావత్ దక్షిణ భారతదేశానికి వెలుగులు విరజిమ్ముతోంది. అయితే, బి-థర్మల్ ప్రాజెక్ట్ యొక్క జీవిత కాలం 50 సంవత్సరాలు, కానీ ప్లాంట్ స్థాపించబడి 59 సంవత్సరాలు కావడంతో, తరచుగా సమస్యలు తలెత్తుతాయి. ప్లాంట్ల నిర్వహణ భారంగా మారింది. ఇటీవల యూనిట్ ట్రిప్ అయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కావడంతో మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో కృష్ణుడి పాత్ర.. హీరో నాని ఏమన్నారంటే?
[ad_2]