Bhagyashri borse: ‘త్వరలోనే ఆ విషయాలు వెల్లడిస్తా’.. లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే

[ad_1]
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ మాత్రం భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టుంది.
మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాకముందే ఆఫర్లు దక్కించుకుందీ బ్యూటీ. ఇప్పటికే పలువురు మేకర్స్ భాగ్యశ్రీ డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ సెట్స్‌పై ఉండగానే భాగ్యశ్రీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. గౌతమ్ తిన్ననూని దర్శకత్వంలో ‘వీడీ12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసిసట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే ఇంత క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
మిస్టర్ బచ్చన్ ఈవెంట్‌లో భాగ్యశ్రీ..
తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానులకు భాగ్యశ్రీ ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేస్తూ.. ‘నన్ను మీ ఇంటి మనిషిగా ఆదరించినందుకు ధన్యవాదాలు. జిక్కీ పాత్రపై మీరు చూపిన ప్రేమాభిమానాలు ఊహించలేదు. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా తర్వాతి ప్రాజెక్ట్‌ల గురించి మీతో పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తా’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]
Source link