Be sure to check out these 5 things when buying a new smartphone!
కొత్తగా smartphone కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ 5 అంశాలు పరిశీలించండి!

ఎప్పటికప్పుడు లేటెస్ట్ smartphone టెక్నాలజీలు వస్తున్నాయి. ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ కంటే మెరుగైన అంశాలు కనీసం ఇప్పుడు చెప్పబోయే వాటిలో కొన్ని ఉన్నా కూడా మీరు కొత్త phone కొనుగోలు చేయవచ్చు. మీరు smartphone కొనుగోలు చేసి కనీసం సంవత్సరం పూర్తయినట్లే అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఇటీవలే ఫోన్ కొనుగోలు చేసిన వారు ఇప్పటికి ఇప్పుడు కొత్తది కొనడం కూడా వృధానే!
లేటెస్ట్ కెమెరా టెక్నాలజీ
ఈ మధ్యకాలంలో ఫోన్ వెనుక భాగంలో కనీసం మూడు, గరిష్టంగా నాలుగు కెమెరాలు లభిస్తున్నాయి. వాటిలో కూడా 48, 64, 108 మెగాపిక్సల్ రిసల్యూషన్ కలిగిన కెమెరా లు కూడా వస్తున్నాయి. అందుకే కచ్చితంగా మీరు కొనుగోలు చేసే ఫోన్ ఇప్పుడు ఉన్న కెమెరా రిసల్యూషన్ కన్నా ఎక్కువ ఉండేలా, మెరుగైన కెమెరా పనితీరు ఉండేలా జాగ్రత్త వహించండి. కేవలం కెమెరా రిసల్యూషన్ ఎక్కువ ఉన్నంత మాత్రాన సరిపోదు, అందులో ఉపయోగించబడిన కెమెరా సెన్సార్ నాణ్యంగా లేకపోతే ఫోటోలో తగినంత డీటెయిల్స్ లభించదు. అందుకే ఫోన్ కొనేముందు దానికి మీద క్వాలిటీ కూడా పరిశీలించటం మంచిది.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్
60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే కలిగి ఉన్న ఫోన్లు మెల్ల మెల్లగా తగ్గిపోతున్నాయి. గేమింగ్ మరియు స్మూత్ స్క్రోలింగ్ కోసం 90 Hz, 120 Hz, 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు Poco X3నే తీసుకుంటే దీంతో 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LCD స్క్రీన్ ఉంటుంది. Realme 7, Oppo A53లో చూసినా కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రత్యేకంగా గేమింగ్ కోసం రూపొందించబడిన Asus ROG Phone 3లో ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు వాడుతున్న 60 Hz కన్నా ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉండేలా చూసుకోండి.
పైన చెప్పిన రెండు అంశాలతో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865, స్నాప్ డ్రాగన్ 832G, మీడియా టెక్ హీలియో G80 ప్రాసెసర్ ఉన్న ఫోన్లు కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు నీ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ కన్నా మరింత శక్తివంతమైన, బ్యాటరీని ఆదా చేసే ప్రాసెసర్ ఉన్న ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాటరీ విషయంలో కూడా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉండి, వేగంగా ఫోన్ చార్జింగ్ చేసే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్ లను సెలెక్ట్ చేసుకోవడం మంచిది.