Trending news

Atrocity in Bonthapalli, Sangareddy district

[ad_1]

  • బొంతపల్లిలో డబుల్ మర్డర్..
  • వీరభద్రనగర్ కాలనిలో తల్లి కొడుకును నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్యచేసిన నాగరాజు అనే వ్యక్తి..
  • మృతులు తల్లి కొడుకులు సరోజదేవి, అనిల్ యూపీకి చెందిన వారుగా గుర్తింపు..
  • హంతకుడు బీహార్ రాష్ట్రనికి చెందిన వ్యక్తిగా గుర్తింపు..
Sangareddy Crime: నా కొడుకును చంపారు అందుకే చంపేసా.. బొంతపల్లిలో డబుల్ మర్డర్..

Sangareddy Crime: తన కొడుకు చావుకి కారకులు వీరే అంటూ నడిరోడ్డుపై తల్లి, కొడుకును ఓవ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగింది..?

సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. వీరభద్రనగర్ కాలనిలో తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్యచేశాడు. మృతులు తల్లి కొడుకులు సరోజదేవి (50), అనిల్ (30) గా గుర్తింపు. వీరు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి నాగరాజు బీహార్ రాష్ట్రనికి చెందిన వాడిగా గుర్తించారు. పాతగొడవలే హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. ఎందుకు చంపావని స్థానికులు నాగరాజును ప్రశ్నించగా నా కొడుకును చంపారు.. అందుకే చంపాను అంటూ కోపంతో రగిలిపోయాడు. అంతేకాకుండా.. తన భార్యపై కూడా మృతులిద్దరు దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చారని అందుకే చంపానని తెలిపాడు. నా 2 సంవత్సరాల కొడుకు చావుకి కారకులు వీళ్ళే అని, వీరిపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది.

Read also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..

అందుకే ఇవాళ వీరిద్దరిని నాగరాజు హత్య చేసినట్లు అందరి ముందు తెలిపాడు. స్థానిక సమాచారంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగరాజుని అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన 2 సంవత్సరాల కొడుకుని చంపినందుకే చంపానని పోలీసుల వద్దకూడా నాగరాజు తెలుపాడు. దీంతో మృతులు చెందిన అనిల్, సరోజదేవి ఎందుకు నాగరాజు కొడుకును చంపారు అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నాగరాజు కొడుకు చనిపోయి 2 సంవత్సరాల తరువాత మళ్లీ ఇవాళ మృతులిద్దరిని నాగరాజు కత్తితో దాడి చేసి చంపడం పై ఆరా తీస్తున్నారు. నడిరోడ్డుపై డబుల్ మర్డర్ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
IMD Weather: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో వర్షాలు..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close