Arvind Kejriwal Visits Tirumala: Family Darshan & Special Prayers at Sri Venkateswara Temple

[ad_1]
- తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్
- దేశం కోసం, ఢిల్లీ ప్రజల కోసం స్వామివారిని ప్రార్థించాను -కేజ్రీవాల్

Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా, కేజ్రీవాల్‌ను అధికారులు ఘనంగా స్వాగతించారు. ఆయన తన భార్య సునీతతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకొని, ఆర్జిత సేవలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ , ఆయన కుటుంబం నిన్న హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో చేరారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం, కేజ్రీవాల్ కుటుంబం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని, రాత్రి అక్కడ వసతి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్
ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టీటీడీ (TTD) ప్రకారం, శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్న భక్తులు 3 గంటల్లో దర్శనం పూర్తి చేసుకుంటారని కూడా పేర్కొంది. నిన్న 66,449 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, అందులో 20,639 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించారు. హుండీ ఆదాయం కానుకల రూపంలో రూ. 4.12 కోట్ల వరకు వసూలు అయిందని టీటీడీ వెల్లడించింది.
SA vs IND: తిలక్ వర్మ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్యకుమార్!
[ad_2]