Trending news

Arjun Tendulkar claimed his maiden five-wicket haul in first-class cricket during a Ranji Trophy match against Arunachala Pradesh

[ad_1]

  • అర్జున్ టెండూల్కర్ తనదైన ఆటతో రంజీ ట్రోఫీలో.
  • అద్భుతమైన బౌలింగ్ స్పెల్.
  • అరుణాచల్ ప్రదేశ్‌పై తొలిసారి ఐదు వికెట్లు.
Arjun Tendulkar: ఐపీఎల్ వేలానికి ముందు రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగిన అర్జున్ టెండూల్కర్.. ఏకంగా?

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తనదైన ఆటతో రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగారు. అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ తో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా మొదటి రోజు అద్భుతమైన స్థితిలో నిలిచింది. గ్రూప్ మ్యాచ్‌లో అర్జున్ ఐదు వికెట్లు పడగొట్టడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ను కేవలం 84 పరుగులకే ఆలౌట్ చేసింది. గోవా జెర్సీలో ముంబై ఆటగాళ్ల ప్రదర్శన ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీని ఆలోచించేలా చేస్తుంది. ఒకానొక సమయంలో 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన అరుణాచల్ జట్టు.. చివరకు 100 పరుగులు కూడా పూర్తిచేసేలోపే కుప్పకూలింది. దీంతో ఆ జట్టు ఇన్నింగ్స్ 30.3 ఓవర్లలో 84 పరుగుల వద్ద ముగిసింది. గోవా తరఫున టెండూల్కర్ ఐదు వికెట్లతో పాటు మోహిత్ రెడ్కర్ మూడు వికెట్లు, కీత్ పింటో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గోవా బ్యాటర్లు సుయూస్ ప్రభుదేశాయ్, కశ్యప్ బకల్ బ్యాటింగ్ అదరగొట్టి గోవాను మంచి స్థితిలో ఉంది. గోవా 54 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది.

Read Also: Retiring Room In Railways: రైల్వే స్టేషన్‌లోని రిటైరింగ్ రూమ్‌లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

ఇకపోతే, అర్జున్ తన కెరీర్‌లో 17వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలిసారి ఐదు వికెట్లను అందుకోగలిగాడు. 25 ఏళ్ల అర్జున్ 9 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతను 3 మెయిడెన్ ఓవర్లు కూడా వేసి 2.78 ఎకానమీతో బౌలింగ్ చేసాడు. ఈ మ్యాచ్ రెండో ఓవర్‌లో అరుణాచల్ ఓపెనర్ నవమ్ హచాంగ్‌ను జూనియర్ టెండూల్కర్ డకౌట్ గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా నీలం ఓబీ, జై భావ్‌సర్, చిన్మయ్ పాటిల్, మోజీ అర్జున్‌లను అవుట్ చేసాడు.

Read Also: Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అర్జున్ తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టడం ముఖ్యాంశాల్లో అగ్రస్థానంలో ఉంది. అంతకుముందు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్ 49 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. నేటి ప్రదర్శన అర్జున్‌కు దేశవాళీ క్రికెట్‌లో చారిత్రాత్మక ప్రదర్శనగా పేర్కొనవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ ప్రదర్శన రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో సచిన్ టెండూల్కర్ కుమారుడిపై డబ్బు వర్షం కురిపించనుంది. ముంబై ఇండియన్స్ నుండి నిష్క్రమించిన తర్వాత అర్జున్ ఈ నెలలో మెగా వేలంలో కనిపించనున్నాడు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close