Trending news

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

[ad_1]

ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఇది కేంద్రికృతం అయింది.  పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.  వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర – దక్షిణ ఒడిస్సా తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల మూడు రోజుల పాటు కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అలెర్ట్ జారీ చేసింది.

ఆగస్టు 29, గురువారం…  పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం,  అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తరకోస్తాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ  చెబుతోంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు ఉంటాయని వెల్లడించింది. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని వెదర్ డిపార్ట్‌మెంట్ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close