Trending news

AP Secretariat: ఏపీ సెక్రటేరియెట్‌లో కోవర్టులు..! వైసీపీకి లీక్‌లు..!

[ad_1]

  • ఏపీ సచివాలయంలో వైసీపీ కోవర్టులు..?

  • ఎప్పటికప్పుడు వైసీపీ లీడర్లకు చేరుతున్న సమాచారం..!

  • కేబినెట్‌ భేటీలో కీలక చర్చ..

  • దృష్టి సారించాలని.. మార్పులు చేయాలని సీఎం ఆదేశాలు..
AP Secretariat: ఏపీ సెక్రటేరియెట్‌లో కోవర్టులు..! వైసీపీకి లీక్‌లు..!

AP Secretariat: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోవర్టులు ఉన్నారా? ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీ లీడర్లకు చేరవేస్తున్నారా? ఇప్పుడు ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మంత్రులు.. సచివాయలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో.. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారనే అంశంపై చర్చించారు.. ఆయా శాఖల్లో జరిగే పరిణామాలపై వైసీపీకి లీకులిస్తున్నారన్న పలువురు మంత్రులు ఆరోపించారు.. కీలక శాఖల్లోని ముఖ్యస్థానాల్లో వైసీపీ అనుకూలురే ఉన్నారని.. వారిని ఇప్పటి వరకు మార్చలేదంటున్నారు కొందరు మంత్రులు. శాఖల్లోని వైసీపీ అనుకూల లీకు వీరులను గుర్తించాల్సిన అవసరం ఉందని కేబినెట్‌ అభిప్రాయపడిందట..

Read Also: Deputy CM Pawan Kalyan: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌.. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్‌

సచివాలయంలోని కీలక శాఖల్లో చేపట్టాల్సిన మార్పు చేర్పులను వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ చర్యలు తీసుకోవాలని సూచించారు.. లీకుల వ్యవహరంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి తెర వెనుక వైసీపీ ఆడుతున్న డ్రామాలకు సహకరించే వారిని ఊపేక్షించవద్దని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close