Trending news

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!

[ad_1]

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. శుక్ర, శనివారాల్లో పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని,గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. సెప్టెంబరులో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో కొద్దిరోజులుగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంగా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు, ఉక్కపోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని ఐఎండీ సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close