Trending news

AP Rains: తుఫాన్ గండం.. ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు.. ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.!

[ad_1]

పశ్చిమ మధ్య & ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో నున్న నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో గడచిన మూడు గంటల్లోవాయువ్య దిశగా గంటకు 10 కి.మీ వేగంతో కదులుతూ ,ఈరోజు 31 ఆగస్ట్, 2024 ఉదయం 08. 30 గంటలకు 17.7° ఉత్తర అక్షాంశం 84.4° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్), దక్షిణ-ఆగ్నేయంగా 80 కి.మీ. దూరంలో ,విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి తూర్పున 120 కి.మీ దూరంలో గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 180 కి.మీ. దూరంలో ఉన్నది.

ఇది మరింత పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్యనున్న విశాఖపట్నం గోపాలాపూర్ మధ్యనున్న కళింగపట్నంకు దగ్గరగా ఈరోజు 31 ఆగస్టు 2024 అర్ధరాత్రి సమయంలో తీరం దాటే అవకాశముంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు ఈశాన్య ఆనుకుని ఉన్న వాయువ్య అరేబియా సముద్రం మీదనున్న తుఫాను కేంద్రంనుండి , నలియా, మాలెగావ్, బ్రహ్మపురి, జగదల్పూర్,కళింగపట్నం, పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నున్న వాయుగుండం కేంద్రం వరకు కొనసాగుతున్నది.

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————

ఈరోజు:-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం అనేక చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
————————————–

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు  బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి

రాయలసీమ:-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close