Trending news

AP News: ఒడ్డుకొచ్చి రిలాక్స్ అవుతున్న మొసళ్లు.. సీన్ చూడగా బిత్తరపోయిన జాలర్లు

[ad_1]

తెలుగు రాష్ట్రాలకు వరప్రధాయినిగా భావించే శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ముసళ్ళ గుంపు చేరింది. అప్పుడప్పుడు బ్యాక్ వాటర్ నుంచి మొసళ్ళు బయటికి వచ్చి వెళ్తూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అది కూడా పెద్ద పెద్ద మొసళ్లు నీళ్లలో తిరుగుతున్నాయి. బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న గ్రామస్తులలో బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున ముసలి కలకలం రేపింది.

శాతన కోట దగ్గర కూడా మొసళ్లు బ్యాక్ వాటర్ నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి బయటికి వచ్చిన ముసలినీ సెల్ ఫోన్లలో చిత్రీకరించి గ్రామస్తులు యువకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. భయాందోళనలో ఉన్నప్పటికీ కొందరు స్థానిక గ్రామల ప్రజలు.. వాటిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ మొసళ్ళ గుంపు చూసి చేపలు పట్టే కార్మికులు జలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఆంధ్ర తెలంగాణకు మధ్య వారధిగా ఉన్న ఈ బ్యాక్ వాటర్‌పై తెప్పలు పరిగెళ్లపై కూడా స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మొసళ్లను చూసి వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close