AP and Telangana Rains LIVE UPDATES: బెజవాడకు అమావాస్య గండం.. ఖమ్మంకు రేవంత్..

[ad_1]
- తీరం దాటిన వాయుగుండం..
-
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. -
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ అయింది. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్ని రైళ్లను దారి మళ్లీంచింది సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
-
02 Sep 2024 02:38 PM (IST)
వరద టెన్షన్..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరద టెన్షన్.. ఫెర్రీ పరిసరాల్లో క్షణక్షణానికి పెరుగుతున్న వరద.. భవనాల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూపులు..
-
02 Sep 2024 02:34 PM (IST)
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. బోటులో అధికారులతో కలిసి పర్యటన.. వరద ప్రాంతాల్లో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు..
-
02 Sep 2024 02:30 PM (IST)
రాత్రికి ఖమ్మంలోనే సీఎం రేవంత్ బస..
ఖమ్మం బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి ఖమ్మంలోనే రేవంత్ బస.. రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్.. ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో ముంపు ప్రాంతాలు పరిశీలించనున్న రేవంత్..
-
02 Sep 2024 02:28 PM (IST)
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు.. విద్యుత్ సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు.. తక్షణమే పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించి నష్టాన్ని నివారించాలి ఆదేశం.. పోలీస్, రెవెన్యూ, ఇతర అధికారులు అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశం.
-
02 Sep 2024 02:24 PM (IST)
తెలంగాణకు తప్పిన భారీ వాన గండం..
తెలంగాణకు తప్పిన భారీ వాన గండం.. బంగాళాఖాతంలో క్రమంగా బలహీన పడుతున్న వాయుగుండం.. తూర్పు విదర్భ – రామగుండం దగ్గర కేంద్రీకృతమైన వాయుగుండం.. రాగల 12 గంటల్లో పూర్తిగా బలహీన పడనున్న వాయుగుండం.. తెలంగాణలో నేడు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రేపటి నుంచి రాబోయే ఐదు రోజుల తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు.. హైదరాబాద్‌లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం.. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
-
02 Sep 2024 02:23 PM (IST)
మరో అల్పపీడనం
ఉత్తరాంధ్రకు మరో అల్పపీడనం ముప్పు.. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 5 నాటికి ఏర్పాడే అవకాశం ఉందని ప్రకటించిన ఐఎండీ..
-
02 Sep 2024 02:21 PM (IST)
కృష్ణలంకలో మాజీ సీఎం జగన్ పర్యటన..
విజయవాడ కృష్ణలంకలో మాజీ సీఎం జగన్ పర్యటన.. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కృష్ణలంకకు వెళ్లిన జగన్.. వరద బాధితులను కలిసిన జగన్..
-
02 Sep 2024 02:14 PM (IST)
వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్..
కాసేపట్లో సూర్యాపేటకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష.. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న రేవంత్.. రేపు వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన..
-
02 Sep 2024 02:11 PM (IST)
బస్సు సర్వీసులు యథాతధం..
విజయవాడ వెళ్లే బస్సు సర్వీసులు యథాతధం.. హైదరాబాద్ వెళ్లే బస్సులను డైవర్షన్ రూట్లో నడుపుతున్న ఆర్టీసీ.. రాయలసీమ నుంచి విశాఖ వెళ్లే బస్సు సర్వీసులకు తప్పని ఇబ్బంది..
-
02 Sep 2024 02:10 PM (IST)
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
విజయవాడ సింగ్ నగర్ లో కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్.. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న సహాయక చర్యలు.. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నం.. వందకు పైగా మోటారు పడవల సాయంతో రెస్య్కూ ఆపరేషన్..
-
02 Sep 2024 02:08 PM (IST)
450 రైళ్లు రద్దు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు.. ఇప్పటి వరకు 450 ట్రైన్స్ ను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే.. మరో 140 రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
-
02 Sep 2024 01:41 PM (IST)
విజయవాడకు అమావాస్య గండం..
విజయవాడకు అమావాస్య గండం.. అమావాస్య కారణంగా పోటు మీదున్న సముద్రం.. పోటు మీదుంటే వరదని తనలోకి ఇముడ్చుకోలేని సముద్రం.. వరద జలాలు సముద్రంలో కలవకుంటే పెరగనున్న ముంపు భయం.. ఎగువ నుంచి భారీ వరద, దిగువన సముద్రపోటుతో భయపడుతున్న బెజవాడ వాసులు..
-
02 Sep 2024 01:27 PM (IST)
వరదలో కొట్టుకుపోయిన 10 కార్లు..
ఎన్టీఆర్: నందిగామలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన కార్లు.. ఐతవరంలో 65 జాతీయ రహదారిపై భారీ వరద.. భారీ వరదలో కొట్టుకుపోయిన 10 కార్లు..
-
02 Sep 2024 01:21 PM (IST)
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద నీరు..
కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు చేరుతున్న వరద నీరు..
ప్రకాశం బ్యారేజీకి అంతకంతు పెరుగుతున్న వరద.. 11.3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా.. బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న అధికారులు..
-
02 Sep 2024 01:18 PM (IST)
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక తనిఖీలు..
అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక తనిఖీలు.. మళ్లీ క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు.. సీఎం ఆకస్మిక తనిఖీలతో పరుగులు పెడుతున్న అధికారులు..
-
02 Sep 2024 01:18 PM (IST)
నీటమునిగిన యనమలకుదురు..
వరదపోటుతో నీటమునిగిన యనమలకుదురు.. ఇళ్లలోకి చేరిన వరదనీరు.. వేలసంఖ్యలో నిర్వాసితులు.. బోట్లలో నిర్వాసితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు..
-
02 Sep 2024 01:07 PM (IST)
డబ్బులు ఇస్తేనే రక్షిస్తాం..
పడవల్లో సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు డబ్బులు డిమాండ్.. ఒక్కొక్కరికి రూ. 1500 ఇస్తేనే బోటులో తరలిస్తామంటున్న నిర్వహకులు.. కనికరం లేుండా డబ్బులు డిమాండ్ చేస్తున్న కొందరు వ్యక్తులు.. నీరు, ఆహారం లేక విజయవాడ ప్రజలు ఇబ్బంది.. రెస్య్కూ బృందాలు రక్షించాలని వేడుకుంటున్న బాధితులు..
-
02 Sep 2024 12:39 PM (IST)
మోకిలా విల్లాలను ముంచెత్తిన వరద నీరు
శంకర్‌పల్లిలో మోకిలా విల్లాలను ముంచెత్తిన వరద నీరు.. నీట మునిగిన లాపలొమా విల్లాస్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విల్లాల్లోని జనం..
-
02 Sep 2024 12:38 PM (IST)
నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..
నేషనల్ హైవేపై దారి మళ్లింపుతో భారీగా ట్రాఫిక్ జామ్.. నార్కట్ పల్లి వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. కోదాడ మండలం రామాపురం వద్ద వరద ఉధృతితో రాకపోకలకు బ్రేక్.. నిన్నటి నుంచి వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు.. నార్కట్ పల్లి, మిర్యాలగూడ మీదుగా విజయవాడకు దారి మళ్లింపు.. హెవీ వెహికిల్స్ భారీగా వస్తుండటంతో ట్రాఫిక్ జామ్..
-
02 Sep 2024 12:32 PM (IST)
కోదాడ- విజయవాడ హైవేపై నిలిచిన రాకపోకలు..
కోదాడ- విజయవాడ హైవేపై నిలిచిన రాకపోకలు.. బ్రిడ్జికి రెండు వైపులా నిలిచిపోయిన వందలాది వాహనాలు.. గరికపాడు వంతెనపై తగ్గిన వరద ఉధృతి.. రోడ్డు కోతకు గురవడంతో రాకపోకలకు అంతరాయం..
-
02 Sep 2024 12:28 PM (IST)
బాధితులను పరామర్శించిన మంత్రి సీతక్క..
మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రహదారులు.. రోడ్లు, నీట మునిగిన కాలనీలు పరిశీలించిన మంత్రి సీతక్క.. వరద బాధితులను పరామర్శించిన మంత్రి సీతక్క..
-
02 Sep 2024 12:27 PM (IST)
అధికారులు అలర్ట్ గా ఉండాలి..
భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలి.. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి.. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలి.. పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలి- సీఎం రేవంత్
-
02 Sep 2024 12:24 PM (IST)
తెలంగాణలో వరద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంపు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంపు.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు.. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు రూ. 5 కోట్లు విడుదల.. తక్షణ సాయం కోసం నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
-
02 Sep 2024 12:21 PM (IST)
బైక్ పైనుంచి కిందపడిన మంత్రి పొంగులేటి..
ఖమ్మం: మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం.. బైక్ నుంచి కిందపడ్డ మంత్రి పొంగులేటి, మోకాలు కింద గాయం.. ముంపు ప్రాంతంలో బైక్ పై పర్యటిస్తుండగా ఘటన..
-
02 Sep 2024 12:18 PM (IST)
తమను ఎవరు పట్టించుకోవడం లేదు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం వాసుల ఇక్కట్లు.. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. తమను ఎవరు పట్టించకోవడం లేదని ఆవేదన..
-
02 Sep 2024 11:51 AM (IST)
శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద..
శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద నీరు.. SRSP 8 గేట్లు ఎత్తి నీరు విడుదల.. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు SRSP పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు..
-
02 Sep 2024 11:43 AM (IST)
తీవ్రంగా శ్రమిస్తున్న రెస్య్కూ టీమ్స్..
విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల నుంచి బాధితుల తరలింపు.. బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రెస్య్కూ టీమ్స్.. బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. బుడమేర ఎఫెక్టుతో రెండున్నర లక్షల మందికి ఇబ్బందులు..
-
02 Sep 2024 11:28 AM (IST)
కరకట్ట గోడ వద్ద కోత..
విజయవాడ కృష్ణలంకను భయపెడుతున్న కృష్ణమ్మ.. కరకట్ట గోడ వద్ద కోత.. ఇసుక బస్తాలతో కట్టను పటిష్టం చేస్తున్న స్థానికులు, పోలీసులు.. వరద ప్రవాహంఎక్కువగా ఉండడంతో ప్రమాదంలో రివర్ వ్యూ పార్క్.. సందర్శకులను అనుమతించని అధికారులు..
-
02 Sep 2024 11:15 AM (IST)
నిండుకుండలా హుస్సేన్ సాగర్..
హైదరాబాద్: నిండుకుండలా హుస్సేన్ సాగర్.. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద.. హుస్సేన్ సాగర్ పుల్ ట్యాంక్ లెవెల్ దాటిన వరద నీరు..
-
02 Sep 2024 11:07 AM (IST)
ప్రాణనష్టాన్ని నివారించగలిగాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ప్రాణనష్టాన్ని నివారించగలిగాం.. విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నాం.. తెలంగాణలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.. అధికారులు 24 గంటలు విధుల్లో ఉండి శ్రమిస్తున్నారు-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-
02 Sep 2024 10:49 AM (IST)
ముంపు ప్రాంతాలకు సీఎం రేవంత్..
ఖమ్మం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్..
-
02 Sep 2024 10:21 AM (IST)
రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్..
రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్.. ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు.. నిన్న రాత్రి వరకు 177 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. 142 రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు.. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్న అధికారులు.. ట్రాక్ పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం.. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు..
-
02 Sep 2024 10:17 AM (IST)
వరద ఎఫెక్ట్.. ఏపీ- తెలంగాణ మధ్య రాకపోకలు బంద్..
హైదరాబాద్- విజయవాడ మధ్య హైవే బంద్.. చిల్లకల్లు దగ్గర హైవేపై భారీగా వరద నీరు.. రామాపురం ఎక్స్ రోడ్ వద్ద కూలిపోయిన వంతెన.. వాహనాలను దారి మళ్లించిన పోలీసులు.. చౌటుప్పల్, నల్గొండ, పిడుగురాళ్ల మీదుగా దారి మళ్లీంపు.. సూర్యాపేట, ఖమ్మం మధ్య పొంగిపొర్లుతున్న పాలేరు నది.. ఖమ్మం వెళ్లే వాహనాలు నకిరేకల్, తుంగతుర్తి మద్దిరాల మీదుగా మళ్లింపు..
-
02 Sep 2024 10:14 AM (IST)
సహాయక చర్యల్లో మత్య్సశాఖ బోట్లు..
అమరావతి: సహాయక చర్యల్లో మత్య్సశాఖ నుంచి 109 బోట్లు.. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో ముంపు ప్రాంతాలకు చేరుకున్న 56 బోట్లు.. మరో 53 బోట్లు తక్షణమే పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం.. బోట్లను తరలించిన అధికారులు..
-
02 Sep 2024 09:48 AM (IST)
ప్రమాదం అంచున రామలింగేశ్వర నగర్
విజయవాడ: ప్రమాదం అంచునరామలింగేశ్వర నగర్.. కొన్ని ప్రాంతాల్లో కృష్ణాది రిటైనింగ్ వాల్ దాటి వచ్చేసిన వరద.. మరికొన్ని చోట్ల రిటైనింగ్ వాల్ ను తాకిన వరద.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్న రామలింగేశ్వర నగర్ వాసులు..
-
02 Sep 2024 09:47 AM (IST)
చెరువుకు గండి.. నీట మునిగిన పంటలు
మెదక్: హవేలీ ఘనపూర్‌లో పెద్ద చెరువుకు గండి.. చెరువుకు గండి పడటంతో నీట మునిగిన పంటపొలాలు.. పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం, ఆందోళనలో రైతులు..
-
02 Sep 2024 09:31 AM (IST)
రిటైనింగ్ వాల్ లీక్..
విజయవాడ: రామలింగేశ్వర నగర్ లో భారీగా వరద నీరు.. 7వ లైన్లో రిటైనింగ్ వాల్ లీక్ అవ్వడంతో కాలనీలోకి నీరు.. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలింపు..
-
02 Sep 2024 09:17 AM (IST)
బెజవాడకు రెండువైపుల నుంచి ముంపు..
బెజవాడకు రెండువైపుల నుంచి ముంపు.. ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు.. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో.. 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద.. 12 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా.. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈస్థాయిలో వరద.. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం.. 24 కాలనీలు, పలు గ్రామాలను ముంచెత్తిన వరద..
-
02 Sep 2024 09:16 AM (IST)
విజయవాడకు చేరిన పవర్ బోట్స్
ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్.. నిన్న పవర్ బోట్స్ కావాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు..
-
02 Sep 2024 08:59 AM (IST)
వరదపై సీఎం చంద్రబాబు సమీక్ష..
అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్న చంద్రబాబు..
-
02 Sep 2024 08:58 AM (IST)
నీట మునిగిన పాల ఫ్యాక్టరీ..
విజయవాడలోని విజయ పాల ఫ్యాక్టరీలోకి భారీగా వరద నీరు.. నీరు చేరడంతో నిలిచిన పాల ఉత్పత్తి.. కొత్త యూనిట్ నుంచి పాలను సరఫరా చేస్తున్న విజయ డెయిరీ..
-
02 Sep 2024 08:56 AM (IST)
వర్షాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు రద్దు..
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్ల రద్దు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో మరో 6 రైళ్లు రద్దు.. మరో 3 రైళ్లు తాత్కాలికంగా రద్దు, 10 రైళ్లు దారి మళ్లింపు..
-
02 Sep 2024 08:53 AM (IST)
విజయవాడను ముంచేసిన బుడమేర..
బెజవాడను ముంచేసిన బుడమేరు వాగు.. 8 అడుగుల ఎత్తున వరద నీరు, 15 డివిజన్లపై ప్రభావం.. బుడమేరు ప్రభావంతో నీట మునిగిన సుమారు 25 వేల ఇళ్లు.. ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు.. వేలాది ఎకరాల్లో మునిగిన పంటలు..
-
02 Sep 2024 08:51 AM (IST)
పెరుగుతున్న వరద
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం ఫెర్రీ పరిసరాల్లో పెరుగుతున్న వరద.. ఇళ్లల్లోకి చేరుతున్న వరద నీరు, భవనాలపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూపులు..
-
02 Sep 2024 08:49 AM (IST)
కృష్ణమ్మ దూకుడు.. ప్రకాశం బ్యారేజీ స్థాయి వరద నీరు
ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న కృష్ణమ్మ దూకుడు.. ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. 70 గేట్లు ఎత్తివేత, కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల.. రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.36 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.. ప్రకాశం బ్యారేజీకి 2009 నాటి కంటే ఎక్కువగా 15 వేల క్యూసెక్కుల నీరు..
-
02 Sep 2024 08:21 AM (IST)
హైదరాబాద్- విజయవాడ మధ్య హైవే బంద్..
హైదరాబాద్ విజయవాడ మధ్య హైవే బంద్.. చిల్లకల్లు వద్ద హైవేపై భారీగా వరదనీరు.. కేంద్రం నుంచి రెస్క్యూ టీమ్స్.. రంగంలోకి బోట్లు, హెలికాప్టర్లు..
-
02 Sep 2024 08:20 AM (IST)
వరద ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు..
విజయవాడ: కృష్ణమ్మకు వరద ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు కొట్టుకొచ్చిన బోటు.. ప్రకాశం బ్యారేజీ గేటును ఢీ కొన్న బోటు.. బోటు ఢీ కొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్..
[ad_2]