Andhra Pradesh Home Minister Anitha Warns Of Strict Action against Social Media Trollers

[ad_1]
- అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయి..
- #
ఆడ పిల్లలను ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు.. - #
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతాం: మంత్రి అనిత

AP Home Minister: అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారు.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళకు తెలుసా అని అడిగారు. రాజకీయ ముసుగులో వచ్చిన వైసీపీ నాయకుల గురించి ప్రజల ముందు ప్రభుత్వం ఉంచుతుంది.. వాళ్ళ పార్టీలోనే ఎంపీగా రఘురామ కృష్ణం రాజుపై అప్పట్లో పెట్టింది అక్రమ కేసు కాదా అని ఆమె అడిగారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం.. మీలా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడం లేదు అని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు.
Read Also: YS Jagan: మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?
ఇక, డిజిటల్ కార్పోరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డిని చేసి ప్రభుత్వ నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించారు అని హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆరోపించారు. రాయలసీమలో మహిళలను ఏదైనా అంటే ఊరుకోరు.. మరి సొంత చెల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోయారు అని మండిపడింది. కానీ, మా ప్రభుత్వం అలా కాదు.. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని అరెస్ట్ చేసి తీరుతామన్నారు. ఇక, తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని కోర్టులకు జగన్ వెళ్తున్నారని ఆరోపించింది. సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని అన్నారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు తిట్టారని చెప్పుకొచ్చారు. వాళ్లు పెట్టిన పోస్టులపై న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసిందని హోం మంత్రి అనిత పేర్కొ్న్నారు.
[ad_2]