Andhra Pradesh: భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..

[ad_1]
- భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
-
2018 సంవత్సరంలో భర్తను హత్య చేసిన భార్య -
గరుగుబిల్లి మండలం తోటపల్లి పార్కు సమీపంలో హత్య -
పెళ్లయిన వారం రోజులకే ప్రియుడు మోజులో పడి భర్తను మర్డర్ చేయించిన భార్య -
ఈ కేసు నేడు పార్వతీపురం జిల్లా కోర్టు తీర్పు వెల్లడి.

భర్తను హత్య చేసిన ఘటనలో పార్వతీపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో సహా హత్యకు సహకరించిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు వెలువడింది.
Read Also: Poonam Kaur: అల్లు vs మెగా రచ్చ.. అల్లు అర్జున్ కి పూనమ్ మద్దతు
వివరాల్లోకి వెళ్తే.. 2018 సంవత్సరంలో భర్తను హత్య చేసిన ఘటనలో భార్యతో పాటుగా సహకరించిన నిందుతులకు పార్వతీపురం జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గరుగుబిల్లి మండలం తోటపల్లి పార్కు సమీపంలో ఈ హత్య అప్పుడు సంచలనం సృష్టించింది. అయితే.. పెళ్లయిన వారం రోజులకే ప్రియుడు మోజులో పడ్డ భార్య సరస్వతి.. భర్తను పథకం ప్రకారం హత్య చేయించింది. కాగా.. ఈ హత్య ఘటనపై పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. కాగా.. అప్పటి నుంచి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు.. ఈరోజు తీర్పు వచ్చింది. ఈ కేసులో.. మొత్తం ఆరుగురికి యావజ్జీవ కారాగర శిక్ష విధించింది పార్వతీపురం జిల్లా కోర్టు.
Read Also: Doctors safety: డాక్టర్ భద్రత కోసం రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..
[ad_2]