Trending news

Andhra Pradesh: ఏపీలో మందుబాబులు పండగ చేసుకునే వార్త.. రేట్లు అక్కడిలా

[ad_1]

ఏపీలో కొత్త మద్యం పాలసీ కోసం సర్కార్‌ కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త విధానం రూపకల్పనకు కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఎక్సైజ్‌శాఖ ప్రాథమిక ప్రతిపాదనలను, నివేదికలను  ఈ కమిటీ రివ్యూ చేయనుంది. అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించనుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మరో వారంలోనే న్యూ లిక్కర్ పాలసీ అనౌన్స్ చేయనున్నారు. అక్టోబరు 1వ తేదీ నాటికి నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా 2019 కంటే ముందున్న తరహా మద్యం విధానాన్నే మళ్లీ రాష్ట్రంలో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. లిక్కర్ రిటైల్‌ వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించనుంది. కేరళ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,  తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసిన ప్రభుత్వం… తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని స్వల్ప మార్పులతో ఏపీలోనూ తీసుకురాబోతున్నట్లు తెలిసింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల మనీ కట్టాల్సి ఉంటుంది. ఈ రుసుం  నాన్‌ రిఫండబుల్‌ అని అధికారుల ద్వారా తెలిసింది. మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్లు అనధికారికంగా తెలిసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close